ETV Bharat / health

అలర్ట్ - డిన్నర్‌ తర్వాత ఈ పండ్లను తింటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ! - What Fruit To Avoid Before Bed

Do Not Eat Fruits At Night : చాలా మందికి నైట్‌ భోజనం చేసిన తర్వాత.. పండ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే, కొన్ని రకాల పండ్లను డిన్నర్‌ తర్వాత తినకూడదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి తినకూడని పండ్లు ఏవి ? తింటే ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Fruits
Fruits To Avoid At Night (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 2:44 PM IST

Fruits To Avoid At Night : హెల్దీగా ఉండటానికి పండ్లను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఉండే విటమిన్‌లు, ఖనిజాలు మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అంటుంటారు. అయితే, అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్నింటిని రాత్రిపూట తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నైట్‌ తినకూడని పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ : పైనాపిల్‌ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని నైట్‌ టైమ్‌లో తినడం వల్ల కడుపులో యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

మామిడి పండ్లు : చక్కెర స్థాయులు అధికంగా ఉండే పండ్లలో మామిడి ఒకటి. వీటిని నైట్‌ పడుకునే ముందు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మామిడి పండ్లను పగటి పూట తినడమే మంచిదంటున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన బెస్ట్ సలాడ్స్ ఇవే - ప్రిపరేషన్ వెరీ ఈజీ - రుచి సూపర్​గా ఉంటుంది!

సిట్రస్ పండ్లు : కొంతమంది రాత్రి భోజనం చేసిన తర్వాత నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి పండ్లను తింటుంటారు. కానీ, ఇలా సిట్రస్‌ పండ్లను తినడం వల్ల కొందరిలో గుండెల్లో మంటగా అనిపించి సరిగ్గా నిద్రపట్టకపోవచ్చని నిపుణులంటున్నారు. కాబట్టి, వీటికి దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.

ద్రాక్ష : ద్రాక్ష పండ్లలో సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రాత్రి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండ్లు : ఈ పండ్లలో కూడా షుగర్‌ ఎక్కువగా ఉంటుందట. వీటిని నైట్‌ టైమ్‌లో తినకుండా పగలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తినడం వల్ల త్వరగా నిద్ర పట్టదని చెబుతున్నారు. 2010లో "ప్లోస్ వన్" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రాత్రి పూట అరటి పండు తినడం వల్ల నిద్రలేమిని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ స్కూల్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్‌లో డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ జె. స్టెయిన్‌మెట్జ్, PhD పాల్గొన్నారు.

పుచ్చకాయ : ఇందులో వాటర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని రాత్రిపూట తినడం వల్ల తినడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నైట్‌ సరిగ్గా నిద్ర పట్టదు. అందుకే రాత్రి పుచ్చకాయను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

కివీ : ఈ పండ్లలో విటమిన్‌ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే, వీటిని నైట్‌ టైమ్‌లో తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణులంటున్నారు.

చెర్రీలు : ఈ పండ్లలో సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఇవి నైట్‌ టైమ్‌లో తినడం వల్ల మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

బొప్పాయి : దీనిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయిని రాత్రిపూట తినడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ పండును పగటి వేళ తినడం మంచిది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఒత్తిడితో బుర్ర భేజా ఫ్రై అవుతుందా? మీ ఫుడ్​లో ఇవి చేర్చుకుంటే క్షణాల్లో మటుమాయం!

అలర్ట్​: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా ? అయితే మీకు ఈ ప్రాబ్లమ్​ ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.