ETV Bharat / health

"డీటాక్స్ డ్రింక్స్​ తాగితే.. లివర్​ను బట్టలు ఉతికినట్టుగా క్లీన్ చేస్తాయి" - ఇందులో నిజమెంత? - వైద్యుల ఆన్సర్ ఇదే! - Do Liver Detox Drinks Work - DO LIVER DETOX DRINKS WORK

గాడితప్పిన ఆహారపు అలవాట్ల నుంచి మద్యపానం దాకా.. ఎన్నో రకాల కారణాలతో కాలేయంలో సమస్యలు వస్తున్నాయి. ట్యాక్సిన్స్ పేరుకుపోయి కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు డీటాక్స్​ డ్రింక్స్ చక్కటి పరిష్కారమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవమెంత? నిజంగానే డీటాక్స్ మందులు పనిచేస్తాయా? దీనిపై వైద్యులు ఏం చెబుతున్నారు?

Do Liver Detox Drinks Work
Do Liver Detox Drinks Work (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 10:59 AM IST

Updated : Aug 16, 2024, 3:41 PM IST

Do Liver Detox Drinks Work : ఇటీవల కొంతమంది లివర్ డీటాక్స్ పేరుతో కొన్ని డ్రింక్స్, సొంత రెమిడీలు ప్రచారం చేస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలు(ట్యాక్సిన్​లు) బయటకు వెళతాయన్నది దాని సారాంశం. మరి.. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

పసరు, పచ్చ పానీయాలతో కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎవరో చెబితే నమ్మకూడదని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఇప్పా విమలాకర్ రెడ్డి సూచిస్తున్నారు. ఆకులు ఏరుకొచ్చి కడుక్కోవడం, మిక్సీ వేసి రసం తాగడం అంతా వృథా ప్రయాస అంటున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ఎక్కువ కాబట్టి.. అలాంటి చోట నుంచి తెచ్చిన ఆకుల్ని సరిగ్గా కడక్కపోయినా, ఉడకబెట్టకపోయినా అమీబియాసిస్ వచ్చేసి లివర్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వాటికి తోడు నులిపురుగులు లాంటివి కూడా పేగుల్లో పెరిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎవరో చెప్పారని, ఏవేవో పసర్లు తయారు చేసుకుని వాడుతూ ఇక వచ్చిన ఇబ్బందేమీ లేదంటూ.. మద్యపానం చేస్తే పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. కాలేయానికి ఏదైనా విషం ఉందంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో ముందుండే పదార్థం ఆల్కహాలే. మందు ఏమాత్రం తాగినా అది సరాసరి కాలేయ కణాల్ని దెబ్బతీస్తుంది. పైగా అవి మానకుండా, కొత్తవి పుట్టకుండా, వాటి స్థానంలో ఫైబ్రోసిస్ (అంటే గట్టి పనికిరాని కణజాలాన్ని) ఏర్పడేలా చేస్తుంది. ఫలితంగా ఎంతో మృదువైన కాలేయం గట్టిపడి పోయి చివరికి పనికి రాకుండా అవుతుంది. కాలేయంలో కొవ్వు చేరడాన్నే ఫ్యాటీ లివర్ సమస్యగా పిలుస్తారు. సహజంగా కాలేయంలో కొద్దిగానే కొవ్వు ఉంటుంది. కానీ, అది మోతాదును మించి (5శాతం) ఉంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయంలో లివర్ కణాలు మాత్రమే ఉండాలి. కానీ, ఆ కణాల మధ్య కొవ్వు చేరితే దానిని ఫ్యాటీ లివర్​గా భావిస్తారు. శరీర బరువు, ఆహారం, ఆల్కహాల్, మద్యం, మధుమేహం, రక్తపోటుపై ఫ్యాటీ లివర్ సమస్య ఆధార పడి ఉంటుంది. ఇది చాప కింద నీరులా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

- డాక్టర్ ఇప్పా విమలాకర్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

కాలేయం ఆరోగ్యానికి కాచి చల్లార్చిన వడపోసిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తర్వాత అంత్యంత తీవ్ర స్థాయిలో కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి హెపటైటిస్ వైరస్​లని... ఇవి కలుషిత నీటిని తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తాయని వివరిస్తున్నారు. అందుకే స్వచ్ఛమైన నీటిని తాగాలని తెలిపారు. వాడేసిన సూదులను వినియోగించడం, అసురక్షిత శృంగారం మొదలైన వాటివల్ల కూడా కాలేయం దెబ్బతింటుందని.. అందుకే కాలేయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.

రోజూ వ్యాయామం చేసేవాళ్లు కాలేయం విషయంలో కాస్త ధైర్యంగా ఉండొచ్చని.. వర్కౌట్స్ వల్ల లివర్​లో కొవ్వు నిల్వలు తగ్గిపోతాయంటున్నారు వైద్యులు. అలాగే ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మిఠాయిలు, నిల్వ ఉంచిన పచ్చళ్లు కాలేయానికి చేటు చేస్తాయని చెప్పారు. కృత్రిమ రంగులు కలిపిన ఆహారపదార్థాలు, మరిగించిన నూనెలో వేయించే వాటిని పూర్తిగా దూరం పెట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే వాటిని కాలేయం నిర్వీర్యం చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి కాలేయంపై వీలైనంత భారం తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా అనవసర ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, విటమిన్ మాత్రలు వాడకపోవడం మంచిదని అంటున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : షుగర్, గుండె పోటు, ఊబకాయం - ఇవి​ రావడానికి కారణం తెలిసిపోయింది! - Trans Fats Foods List

మందులతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చా? - నిపుణుల మాటేంటి? - Is any Medication for Knee Pain

Last Updated : Aug 16, 2024, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.