ETV Bharat / health

పీసీఓఎస్, పీసీఓడీ వేధిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు! - PCOS And PCOD Symptoms

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:32 AM IST

Updated : Jun 12, 2024, 3:04 PM IST

Difference between PCOS and PCOD : ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి రెండు సమస్యలూ ఒకేలా అనిపించినప్పటికీ.. వీటి లక్షణాలు భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

PCOS and PCOD
Difference between PCOS and PCOD (ETV Bharat)

Difference Between PCOS and PCOD : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల నేడు చాలా మంది అమ్మాయిలు పీసీఓఎస్, పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. అధిక శాతం మంది ఇవి రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ.. వీటి లక్షణాలు కొంత భిన్నంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వీడి మధ్య మధ్య తేడాలు ఏంటీ ? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ? ఈ సమస్యలను ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ (పీసీఓడీ) :

  • అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండిపోవడంతో పీరియడ్స్ రావు. అండం అండాశయంలోనే ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే 'పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్' (పీసీఓడీ) అని అంటారు.
  • వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్ ఫుడ్‌, మైదాతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
  • దీనివల్ల ఎక్కువ మందికి నెలసరి తక్కువగా వస్తుంది.
  • అలాగే కొంతమందిలో మగవాళ్ల హార్మోన్లు పెరుగుతాయి. ఇంకా అవాంఛిత రోమాలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి.
  • స్వీట్‌ పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది.
  • గర్భధారణ ఆలస్యం కావడంతోపాటు వచ్చినా నిలవడం కష్టంగా ఉంటుందని నిపుణులంటున్నారు.
  • ఇంకా మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు.

పీసీఓఎస్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?

పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటే ఏమిటీ ?

  • ఆడవాళ్ల శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది క్రమంగా 'పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్' (పీసీఒఎస్) దారితీస్తుందని నిపుణులంటున్నారు.
  • పీసీఓఎస్ వల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్‌ స్వింగ్స్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయి.
  • గర్భం దాల్చలేకపోవడానికి పీసీఓఎస్‌ కూడా ఒక కారణం కావచ్చు! కాబట్టి దీనిని నిర్ధారించుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించి వారు సూచించిన టెస్ట్‌లు చేయించుకోవాలి.
  • పీసీఓఎస్‌ ఉన్న వారికి టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2022లో 'World Journal of Diabetes' జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎండోక్రినాలజిస్ట్ 'డాక్టర్‌ Xue-Mei Huang' పాల్గొన్నారు. PCOS ఉన్న స్త్రీలలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
  • శరీరంలో హార్మోన్ల అసమతుల్యత క్రమంగా పీసీఓఎస్‌కు దారితీసి.. తలనొప్పి వస్తుంది.
  • ఈ సమస్యతో బాధపడేవారిలో చంకలు, మడతల వద్ద చర్మం నలుపు రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

  • అధిక బరువుతో బాధపడే మహిళలు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలి. రోజూ, వ్యాయామం చేస్తూనే, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి.
  • తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. తృణధాన్యాలను డైట్‌లో యాడ్‌ చేసుకోవాలి.
  • ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • ప్రతి వారం కనీసం 150 నిమిషాలు వ్యాయాం చేయాలి.
  • ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కూడా పీసీఓఎస్, పీసీఓడీకి దారితీస్తాయి. కాబట్టి, స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పీసీఓఎస్​తో బాధపడుతున్నారా? - ఇలా చేశారంటే అంతా సెట్! - Food Guide for Pcos Women

PCOS issues : ఇలా చేస్తే పీసీఓఎస్‌ ఉన్నా పిల్లలు పుడతారట!

Last Updated : Jun 12, 2024, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.