ETV Bharat / health

మీ కోసం వ్యాయామమే దిగి వచ్చింది - జస్ట్ 22 నిమిషాలు చేసినా చాలట! - 22 Minutes Daily Exercise Benefits

Daily 22 Minutes Exercise Benefits: ఆధునిక జీవనశైలి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎవరి నోట విన్నా "టైమ్ లేదు" అనే మాటే వినిపిస్తూ ఉంటుంది! దీంతో.. దేహం ఉక్కు కండలు తిరిగే కసరత్తుల సంగతి అటుంచితే.. కనీస వ్యాయామం కూడా కరవైంది. రోజుకో ఎట్​లీస్ట్ గంట అన్నారు నిపుణులు.. ఆ తర్వాత దాన్ని అర గంటకు కుదించారు.. అయినా లాభం లేకపోయింది.. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టు ప్రకారం జస్ట్ 22 నిమిషాలైనా చేయండయ్యా అంటున్నారు!

Daily 22 Minutes Exercise Benefits
Daily 22 Minutes Exercise Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 1:54 PM IST

Updated : Jan 29, 2024, 1:45 PM IST

Daily 22 Minutes Exercise Benefits : ఈ డిజిటల్​ యుగంలో చదువుకున్న వారంతా కంప్యూటర్​, ల్యాప్​టాప్​ పట్టుకొని గంటల తరబడి కూర్చుంటున్నారు. ఇతరులు కూడా ఉదయాన్నే పని అంటూ వెళ్తున్నారు. కడుపునకు సరైన తిండి ఉండట్లేదు.. కంటికి సరిగా నిద్ర ఉండట్లేదు. ఇక వ్యాయామం గురించి చెప్పుకోవడం కూడా దండగే అన్నట్టు తయారైంది పరిస్థితి.

దీంతో.. ఊబకాయం, గుండెజబ్బులు, బీపీ, షుగర్.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చలాలా పెద్దదే. ఇన్ని రోగాలు వస్తాయని హెచ్చరించినా కూడా చాలా మంది ఒంటికి పనిచెప్పట్లేదు. ఈ నేపథ్యంలో పరిశోధకులు మరో కొత్త థియరీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. రోజులో కనీసం 22 నిమిషాల పాటు వ్యాయామం చేసినా ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. మరి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

రోజుకు 22 నిమిషాలు: బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవడానికి.. రోజుకు 22 నిమిషాల పాటు వ్యాయామం చేయాలట. దీనివల్ల అనారోగ్యం ముప్పు తొలగిపోతుందని ఆ స్టడీ పేర్కొంది.

రోజు ఏ వ్యాయామాలు చేయాలి?:

బ్రిస్క్​ వాకింగ్​ : నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని సులభమైన వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు వైద్య నిపుణులు. రోజూ వాకింగ్​ చేస్తే ఎన్నో రోగాలు నయమవుతాయని, శరీరంలో చెడుకొలెస్ట్రాల్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే.. వేగంగా నడవడం(Brisk Walking) ద్వారా మరిన్ని ప్రయోజనాలున్నాయని వారు చెబుతున్నారు. దీని ద్వారా శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. కాబట్టి.. మీకు వీలున్నప్పుడు బ్రిస్క్​ వాకింగ్​ చేయడం మంచిది.

వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండెపోటు వస్తుందా? వైద్యుల మాటేంటి?

తోటపని : చురుగ్గా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి గార్డెనింగ్ ఒక అద్భుతమైన మార్గం. ఇది ఫిట్‌నెస్ ఔత్సాహికులు ఆమోదించిన వ్యాయామ ఎంపిక. మొక్కల మధ్య రోజు కాసేపు సమయాన్ని గడపడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. అదే విధంగా మానసిక సమస్యలు ఉన్నవారికి మొక్కలు పెంచడం ఒక థెరపీ లాగా పని చేస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఆరు బయట గార్డెనింగ్ చేయడం వల్ల రోజుకు సరిపడినంత విటమిన్ D లభిస్తుంది. అదే విధంగా ఒబెసిటీ ఉన్నవారు రోజూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటికి పాదు చేయడం లాంటి పనులు చేస్తే ఎన్నో క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి.

హిల్​ క్లైంబింగ్​: కొండలు, గుట్టలు ఎక్కడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక సురక్షితమైన మార్గం. ఊరిపితిత్తులు ఆక్సిజన్‌ను మరింత వేగవంతంగా తీసుకోవడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి హిల్​ క్లైంబింగ్​ సూపర్​గా యూజ్ అవుతుంది.

వ్యాయామానికి ముందు, ఆ తర్వాత ఇవి తింటున్నారా? - లేదంటే అంతే సంగతులు!

HIIT వర్కౌట్‌లు : ఫిట్‌గా ఉంటూ.. సమయాన్ని ఆదా చేసుకోవాలని చూసే వారికి ఇది బెస్ట్​ ఆప్షన్​. HIIT అంటే.. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. మీ బ్లడ్ పంపింగ్, ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి HIIT వ్యాయామాలు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర వ్యాయామ పద్ధతులతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో ఈ విధానం సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సో.. రోజులో కనీసం 22 నిమిషాల వ్యాయామం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు. మరి.. కనీసం ఇదైనా చేయండి.

వ్యాయామం చేయడానికి టైమ్ లేదా? - ఆఫీసులోనే ఈ వర్కౌట్స్ చేయండి - పూర్తి ఆరోగ్యంగా ఉంటారు!

Last Updated : Jan 29, 2024, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.