ETV Bharat / health

ఈజీగా వెయిట్​ లాస్​ అవ్వాలనుకుంటున్నారా? - అయితే ఈ చియా సీడ్స్ రెసిపీలు ట్రై చేయాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 6:28 PM IST

Chia Seeds for Weight Loss : ఈరోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య.. అధిక బరువు. ఈ క్రమంలోనే చాలా మంది వేగంగా బరువు తగ్గి స్లిమ్​గా, ఫిట్​గా మారాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే తినే ఫుడ్​ను తగ్గిస్తుంటారు. అలాకాకుండా మీ డైట్​లో చియా సీడ్స్​తో ప్రిపేర్ చేసే ఈ రెసిపీలను చేర్చుకున్నారంటే వేగంగా, ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Weight Loss
Chia Seeds

Chia Seeds Recipes for Weight Loss : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి బరువు పెరగడం తేలిక.. కానీ, దాన్ని తగ్గించుకోవడమే పెద్ద సవాల్. ఈ క్రమంలోనే ఎక్కువ మంది త్వరగా వెయిట్​ తగ్గి స్లిమ్​గా, ఫిట్​గా మారడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. అలాంటివారు తమ రోజువారి డైట్​లో చియా సీడ్స్(Chia Seeds)​తో ప్రిపేర్​ చేసే ఈ రెసిపీలను చేర్చుకున్నారంటే వేగంగా బరువు తగ్గడమే కాదు ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ రెసిపీలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చియా సీడ్స్​తో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీలు ఏంటంటే..

చియా సీడ్స్ వాటర్ : వెయిట్ లాస్ అవ్వడానికి చియా సీడ్స్​ వాటర్ చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం 1/4 కప్పు (40 గ్రాములు) చియా విత్తనాలను 4 కప్పుల (1 లీటర్) నీటిలో 20 నుండి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అవి జెల్​గా మారుతాయి. అలా తాగేయొచ్చు. లేదంటే టేస్ట్​ కోసం నిమ్మరసం లేదా నారింజ జ్యూస్ వంటివి యాడ్ చేసుకుని తాగవచ్చు.

స్మూతీలు : చియా విత్తనాలతో స్మూతీలు ప్రిపేర్ చేసుకుని తాగినా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీకు నచ్చిన పండ్లను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్​లో వేసుకొని పాలు, చియా గింజలను యాడ్ చేసుకొని జ్యూస్​లా పట్టుకోవాలి. అవసరమైతే రుచికోసం కాస్త తేనెను యాడ్ చేసుకోవచ్చు. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా అందించడంతో పాటు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ కూరగాయలు తింటే ఈజీగా వెయిట్ లాస్!

పాన్​కేక్స్​ : మీరు పాన్‌కేక్ ప్రియులైతే చియా గింజలతో కూడిన పాన్‌కేక్‌లు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం చియా గింజలు, గోధుమ పిండి, అరటిపడు గుజ్జు కలిపి మృదువైన పిండిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దాంతో పాన్​కేక్​లను ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై చియా విత్తనాలు, వెన్న, మాపుల్ సిరప్‌ను అదనపు రుచి కోసం గార్నిష్ చేసుకొని తినేయండి.

ఓట్మీల్ : చియాసీడ్స్​తో ప్రిపేర్ చేసుకునే ఓట్​మీల్​తో బోలెడు ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఈ రెసిపీలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో 1 కప్పు పాలు తీసుకొని కాస్త వేడి అయ్యాక 1/2 కప్పు ఓట్స్​ యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మరిగించుకొని దానిని గ్లాసులోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానికి 1 అరటిపండును ముక్కలు చేసి, ఒక టేబుల్​స్పూన్​ చియా సీడ్స్​ కలుపుకోవాలి. అవసరమైతే అదనపు రుచి కోసం కాస్త తేనె, నట్స్, బెర్రీలు, మాపుల్ సిరప్ యాడ్ చేసుకొని తీసుకోవాలి.

పుడ్డింగ్ : చియా విత్తనాలతో పుడ్డింగ్​ను సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందు రోజు రాత్రి.. బాదం, సోయా లేదా కొబ్బరి పాలతో చియా గింజలను కలిపి చియా సీడ్ పుడ్డింగ్‌ను తయారు చేసుకోవాలి. పుడ్డింగ్​కు తియ్యదనాన్ని కల్పించడానికి తేనె లేదా మాపుల్ సిరప్‌ను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గట్టి పడటానికి రాత్రంతా రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. తినే ముందు బెర్రీలు, బాదం గార్నిష్ చేసుకుని తినేయడమే.

ఇక ప్రయోజనాలు చూస్తే.. చియా విత్తనాలలో ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే, ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 2017లో Nutrition Reviews జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ గింజలలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయని తేలింది.

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.