Causes Of Obesity : మారుతున్న జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల నేడు చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎక్కువగా బరువు ఉన్న వారు కొవ్వును కరిగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మనలో ఎక్కువ మంది కేవలం అతిగా తినడం వల్లనే లావు అవుతామని అనుకుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులంటున్నారు! మన నిత్య జీవితంలోని కొన్ని అలవాట్ల వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకీ, ఊబకాయానికి దారితీసే ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిద్రలేమి :
ఈ రోజుల్లో ఎక్కువ మంది అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్ యూజ్ చేస్తున్నారు. అయితే, దీర్ఘకాలికంగా మిడ్‌నైట్ వరకు స్మార్ట్‌ఫోన్ చూడటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని నిద్రలేమి సమస్య వస్తుందట. దీనివల్ల వారు మరుసటి రోజు అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తింటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, బరువు పెరగకుండా ఉండటానికి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
వ్యాయామం చేయకపోవడం :
ప్రస్తుత కాలంలో మెజార్టీ జనాలు పని ఒత్తిడి, టైమ్ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల రోజూ శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల జీవక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి డైలీ నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలను చేయాలని సూచిస్తున్నారు.
క్యాలరీలు ఎక్కువగా తీసుకోవడం :
కొంత మంది వర్క్ ప్రెషర్ వల్ల క్యాలరీలు ఎక్కువగా ఉండే పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, పాస్తా, నూడుల్స్ వంటి వాటిని తింటారు. అయితే, రోజూ వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
షుగర్ ఫుడ్ తినడం :
కొంత మంది తరచూ షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే, చక్కెర అధికంగా ఉండే పదార్థాలను రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2013లో ప్రచురించిన 'British Medical Journal' నివేదిక ప్రకారం.. షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అలాగే చక్కెర పదార్థాలను రోజూ తినడం వల్ల కూడా అధిక బరువు సమస్య వస్తుందని డాక్టర్ దిలీప్ నందమూరి (జనరల్ ఫిజీషియన్) తెలిపారు.
ఇంకా :
- భోజనం చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది.
- ఫ్యాట్, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను తినాలి.
- కొంతమందికి టీవీ చూస్తూ తినడం అలవాటు ఉంటుంది. అయితే, ఇలా టీవీ చూస్తున్నప్పుడు ఏది తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియదు. దీనివల్ల అనవసరంగా అతిగా తిని బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.
- అలాగే కొంత మంది వర్క్ ప్రెషర్ వల్ల భోజనం చేయకుండా ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తర్వాత వీరికి ఆకలి వేసినప్పుడు ఒకేసారి ఎక్కువగా తింటారు. ఇలా టైమ్‌కు సమతుల ఆహారం తినకపోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది.
- మద్యం తాగడం వల్ల బరువు పెరుగుతారు.
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చక్కెర తింటే - మీ బ్రెయిన్‌కు ఏమవుతుందో తెలుసా? - Effects of High Sugar Consumption