ETV Bharat / health

మెంటల్ స్ట్రెస్​ అనుభవిస్తున్నారా? - కారణాలు ఇవే! - reasons for mental stress

Causes Of Mental Stress : ఆధునిక జీవితంలో ఎక్కువ మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే.. ఇలా జరగడానికి మనం రోజువారీ జీవితంలో చేసే చిన్న పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Causes Of Mental Stress
Causes Of Mental Stress
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 12:31 PM IST

Causes Of Mental Stress : మనం ఫిట్​గా ఉండాలంటే.. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా హెల్దీగా బాగుండాలి. అప్పుడే.. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కానీ.. ఈ రోజుల్లో చాలా మంది మానసికంగా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు.. చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేరు. ఫలితంగా.. సమయానికి పని పూర్తికాక మరింతగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలా మానసికంగా ఇబ్బంది పడడానికి పెద్ద పెద్ద సమస్యలే కాకుండా.. మనం రోజూ చేసే చిన్నచిన్న పొరపాట్లు కూడా కారణమవుతుయాని నిపుణులు చెబుతున్నారు. అవేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

డూమ్‌స్క్రోలింగ్..
డూమ్‌స్క్రోలింగ్ అంటే ఎక్కువగా నెగెటివ్‌ అంశాల గురించి ఆలోచించడం. ఇలాంటి వాటి కోసం అదేపనిగా ఫోన్‌లో సర్చ్‌ చేస్తూ ఉంటారు. కొవిడ్‌ సమయంలో ఈ పదం ఎక్కువగా వ్యాప్తిలో వచ్చింది. ఇలాంటి ప్రతికూల అంశాల గురించి వెతికి చూస్తూ.. వాటి వల్ల ఎదురయ్యే నష్టాలను తలుచుకుంటూ ఒకవిధమైన భయానికి, ఆందోళనకు గురవుతుంటారు. ఈ పరిస్థితి మనసుపై బాగా ప్రభావం చూపుతుంది. అందువల్ల.. ఇలాంటి నెగెటివ్ న్యూస్​ ను సాధ్యమైనంత వరకు పక్కనపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

బిజీ షెడ్యూలింగ్..
నేను ఉదయాన్నే ఈ పని పూర్తి చేయాలి.. ఆ తర్వాత ఇంకొకటి, మధ్యాహ్నం మరొకటి.. అంటూ ఇలా రోజంతా బిజీ షెడ్యూల్‌ను వేసుకోవడం వల్ల కూడా మెదడుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ సరిగా కంప్లీట్ కాకపోతే.. ఒత్తిడి పెరుగుతాయని నిపుణులంటున్నారు. అందువల్ల షెడ్యూల్ బిజీగా ఉండొద్దని సూచిస్తున్నారు.

డెస్క్‌ వద్దనే భోజనం..
కొంత మంది వర్క్ ప్రెషర్‌ వల్ల కనీసం.. క్యాంటిన్​కు వెళ్లి భోజనం చేయలేరు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ముందు వర్క్ చేస్తూనే భోజనం చేస్తుంటారు. ఈ పరిస్థితి మీ తీరికలేని పనిని సూచిస్తుంది. ఇది కూడా మానసిక ఒత్తిడికి గురి కలిగిస్తుంది. అందువల్ల.. ప్రశాంతంగా భోజనం చేయాలని చెబుతున్నారు.

టీవీ చూస్తూ భోజనం..
చాలా మందికి టీవీ చూస్తూ భోజనం చేసే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఎంత తింటున్నారో తెలియదు. పదార్థాల రుచిని కూడా ఆస్వాదించలేరు. ఈ అలవాటు వల్ల కూడా మానసికంగా ఒత్తిడికి గురవుతారట.

ఫోన్‌ అతిగా ఉపయోగించడం..
స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఫోన్ అతిగా వాడడం వల్ల మానసిక సమస్యలు అధికమవుతాయని 'జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌' నివేదిక విడుదల చేసింది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచన సామర్థ్యం దెబ్బతినడం వంటివి జరుగుతాయని వెల్లడించింది. అలాగే.. స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు వంటివి కూడా కొంత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయట. ఆ నోటిఫికేషన్‌లో ఏముందో తెలుసుకోవడానికి తరచూ మొబైల్‌ చూడటం వల్ల అది క్రమంగా ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుందని అంటున్నారు.

ఇంకా మరిన్ని..

  • శరీరంలో విటమిన్‌ డి లోపిస్తే కూడా ఒత్తిడి కలుగుతుందట.
  • ఒంటరితనంతో బాధపడేవారు కూడా మానసికంగా ఆందోళనకు గురవుతుంటారు.
  • ఇతరులతో పోల్చుకునే వారు ఒత్తిడికి లోనవుతుంటారు.
  • అలాగే చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌, ప్రాసెస్ చేసిన ఫుడ్‌ తినడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
  • శారీరక శ్రమ చేయని వారిలో కూడా మెంటల్ హెల్త్‌ పాడైపోతుందట. వ్యాయామం కూడా సరైన పద్ధతిలో చేయాలి.
  • ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటునే మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటి వాటివైపు మళ్లాలని సూచిస్తున్నారు.

నిద్రలేవగానే ఫోన్‌ చూస్తున్నారా? - ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!

ఒంటరిగా ఫీల్‌ అవుతున్నారా? - ఈ సమస్య నుంచి ఇలా గట్టెక్కండి!

స్వీట్స్ వదిలించుకోలేకపోతున్నారా? - అయితే ఇలా ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.