Causes For White Patches on Skin: చాలా మందికి పలు రకాల చర్మ సమస్యలు ఎదురువుతూ ఉంటాయి. అలాంటి వాటిలో చర్మంపై ఏర్పడే తెల్లమచ్చలు ఒకటి. చిన్నపిల్లలతోపాటు వయసుతో సంబంధం లేకుండా ఇవి ముఖం, చేతులపై ఏర్పడుతుంటాయి. మరి.. ఈ మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? ఎలా తగ్గించుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
మెలనిన్ ఉత్పత్తి తగ్గుదల: మన శరీరంలో మెలనిన్ (Melanin) అనే కణాలు పని చేయకపోతే రంగు ఏర్పడదు. దాంతో మన చర్మం తెల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. మెలనిన్ కణాలు నల్ల రంగును ఉత్పత్తి చేస్తాయి. మెలనోసైట్స్ వాటంతటవే దెబ్బతినడం వల్ల కూడా చర్మం రంగు కోల్పోయి తెల్లగా మారుతుంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ప్రారంభంలో ఈ తెల్లమచ్చలు చిన్నగా ఉండి క్రమంగా పెద్దగా మారి శరీరమంతా వ్యాపిస్తుంది.
బొల్లి వ్యాధి: బొల్లి వ్యాధి శరీర నిరోధక శక్తికి సంబంధించిన వ్యాధిగా పరిగణించొచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు 0.5 నుంచి 1 శాతం వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా ఉండే ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కణాలు మెలనోసైట్స్ కణాల మీద దాడి చేయడం వల్ల తెల్ల మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై మొలనిన్ కణాలు తగ్గడం వల్ల ఇది కలుగుతుంది.
ఎగ్జిమా: చర్మం పొడిబారడం, కరుకుదనం చర్మంపై తెల్లటి పాచెస్‌కు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. దీనినే ఎగ్జిమా అంటారని చెబుతున్నారు. ఈ సమస్య పిల్లలు, పెద్దవారిలో కనిపిస్తుంది.
చర్మంపై పగుళ్లు: చర్మం పగుళ్ల వల్ల కూడా తెల్లటి పాచెస్ ఏర్పడవచ్చని.. వైద్య పరిభాషలో ఈ పాచెస్‌ను "స్ట్రెస్ ల్యూకోడెర్మా" లేదా "పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపోపిగ్మెంటేషన్" అని పిలుస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా సాధారణమని చెబుతున్నారు.
పొడి చర్మం: కొన్నిసార్లు అధిక పొడి చర్మం తెల్లటి పాచెస్‌కు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం, తేలికపాటి సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం, ఆరోగ్యకరమైన ఆహారం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేట్: చర్మంపై తెల్లటి పాచెస్ ప్రధానంగా మన చర్మం డీహైడ్రేట్ అయినప్పుడు సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు. 2019లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చర్మం డీహైడ్రేట్ అయినప్పుడు మెలనిన్ ఉత్పత్తి 20శాతం వరకు తగ్గుతుందని.. ఇది చర్మంపై తెల్లటి మచ్చలకు దోహదపడే ఒక కారకం కావచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ డో పాల్గొన్నారు. ఈ తెల్లటి మచ్చలను నివారించడానికి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.