Can Diabetic Patient Eat Egg Daily : షుగర్.. పేరులో తీపి ఉంది కానీ, ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డారంటే.. జీవితమంతా చేదే! ఏది తిన్నా లెక్కలు వేసుకొని తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. షుగర్ పేషెంట్లు ఎగ్ తినొచ్చా? లేదా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందేమో అనే భయం కలుగుతుంది. మరి.. రోజూ గుడ్డు తినొచ్చా? నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం.
గుడ్డు తినడం మంచిదే!
మధుమేహంతో బాధపడేవారికి నిత్యం నీరసం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే.. ఇలాంటి లక్షణాలు కనిపించడానికి సమతుల ఆహారం తీసుకోకపోవడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. షుగర్ వ్యాధితో సతమతమయ్యే వారు ఆహారంలో ప్రొటీన్ తప్పక ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. ఈక్రమంలో.. షుగర్ పేషెంట్లు ఆహారంలో రోజూ ఒక గుడ్డును తినడం ఆరోగ్యానికి మంచిదేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్ లతాశశి' అంటున్నారు. అయితే.. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని గుడ్లను తినాలన్నది.. మీరు తీసుకునే మిగతా ఆహారం, ప్రొటీన్‌పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఉడికించిన పల్లీలు టేస్టీ స్నాకే కాదు- హెల్దీ ఫుడ్ కూడా- వెయిట్ లాస్ పక్కా!
కనీసం ఒక గుడ్డు తింటే మంచిదని సూచిస్తున్నారు. లేదా వారానికి అయిదు ఎగ్స్ తీసుకునేలా చూసుకోవాలట. ఇలా గుడ్లు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదని.. మధుమేహం ఉన్నవారు రక్తంలో శాచ్యురేటెడ్ కొవ్వులు పెరగకుండా చూసుకోవాలని చెబుతున్నారు. కేవలం గుడ్లు తినడం వల్ల అధికస్థాయిలో కొలెస్ట్రాల్ పెరగదని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
అయితే.. వారానికి కచ్చితంగా ఎన్ని గుడ్లు తీసుకుంటే మంచిదని తెలుసుకోవడానికి.. "లిపిడ్ ప్రొఫైల్" రక్త పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా.. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎంత ఉందో తెలుస్తుందని, దాన్నిబట్టి కచ్చితంగా వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చు అన్నది వైద్య నిపుణులు చెబుతారని డాక్టర్ లతాశశి సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గాలని మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ - ఈ నేచురల్ పద్ధతులతో ఇట్టే కరిగిపోద్ది!
ఉదయం వాష్ రూమ్‌లో అవస్థలు పడుతున్నారా? - రాత్రివేళ ఈ వాటర్ తాగితే ఆల్ క్లియర్!