Health Benefits Of Boiled Food : ఆహారాన్ని తయారు చేయడంలో సులభమైన మార్గం ఉడకబెట్టడం. ఉడికించి వండటం వల్ల వంట త్వరగా అవడమే వేడి కారణంగా పోషక విలువలు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఉడికించడం వల్ల కీలక పోషకాలను సంరక్షిస్తాయి. హానికరమైన సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే నాశనమై ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది. ఫలితంగా శరీరానికి కావలసిన పోషకాలు అందడం వల్లే పాటు జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. వీటితో పాటు ఆహర పదార్థాలను ఉడికించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం.
అరుగుదల సులభం
ప్రాసెస్ చేసిన, ప్రై చేసిన ఆహార పదార్థాలతో పోలిస్తే ఉడికించిన ఆహారాలు చాలా సులభంగా అరుగుతాయి. జీర్ణ సమస్యలు, కడుపులో ఇబ్బందులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారికి ఇవి చక్కటి ఎంపిక. ఉడికించడం వల్ల ఆహార పదార్థాలు మెత్తగా, సులభంగా మారి జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. తర్వగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
రుచి మెరుగవుతుంది
ఉడికించడం వల్ల ఆహార పదార్థాల స్వాభావిక రుచి మెరుగవుతుంది. వాటిలోని జిడ్డు, కొవ్వు పదార్థాలు తగ్గిపోయి లైట్ ఫుడ్‌గా మారుతుంది. చిన్న పిల్లలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఇవి చక్కటి ఆహారాలుగా పనిచేస్తాయి.
పోషకాలు బదిలం
సరైన పద్ధతిలో ఉడికిస్తే ఆహారంలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. నీరు పోసి కప్పి ఉంచడం వల్ల విటమిన్లు, ఖనిజాలు ఆహారంలో ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. సాధారణంగా వండటం వల్ల నీటిలో కరిగే విటమిన్-బీ, విటమిన్-సీ వంటి వాటిని కోల్పోతాం. ఉడికించడం వల్ల వాటిని సంరక్షించుకున్న వారిమవుతాం.
వంట సులభవుతుంది
వంట త్వరగా అవడానికి సులభమైన పద్ధతి ఉడకబెట్టడం. వంట చేయడం రాని వారికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఉడికించడం వల్ల కూరగాయలన్నీ ఒకేలా ఉడుకుతాయి. వేడి నీరు కారణంగా ఎక్కువ తక్కువల సమస్యలుండవు. సాధారణంగా వంట చేసినప్పుడు కొన్ని బాగా మెత్తగా, మరికొన్ని గట్టిగా ఉండే అవకాశాలున్నాయి.
నష్టాలు :
- ఉడికించి వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- ఉడికించడం వల్ల కూరగాయల నుంచి నీటిలో కరిగిపోయే పోషకాలు దూరమవుతాయి.
- ఉడికించడం వల్ల ఆహార పదార్థాల్లోని టెస్ట్ మాలికుల్స్ని నీరు పూర్తిగా గ్రహించే అవకాశాలున్నాయి.
- ఉడికించడం వల్ల కూరగాయలు, ఆహారాలు మెత్తగా, గుజ్జుగా మారతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రి పూట పాదాల్లో నొప్పా? నిర్లక్ష్యం చేయకండి- ఆ సమస్యకు వార్నింగ్! - Foot Pain At Night
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు డయాబెటిస్ ఉన్నట్లే! - Early Morning Diabetes Signs