ETV Bharat / health

డయాబెటిస్​కు "కాకరకాయ" మందు - షుగర్​ లెవల్స్​ స్టాక్​ మార్కెట్​లా కుప్ప కూలుతాయట! - BITTER GOURD FOR DIABETES

- డయాబెటిస్​తో బాధితులకు కీలక సూచన - డైలీ డైట్​లో కాకరకాయను చేర్చుకోవాలంటున్న నిపుణులు!

BITTER GOURD HEALTH BENEFITS
Bitter Gourd for Diabetes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 1:41 PM IST

Bitter Gourd for Diabetes : డయాబెటిస్ వచ్చాక ఆహారం మొదలు దినసరి కార్యక్రమాల దాకా ఎన్నో మార్పులు చేసుకుంటుంటారు. ఏం చేస్తే షుగర్ లెవల్స్ పెరుగుతాయోనని భయం భయంగా గడుపుతుంటారు. అయితే, వీరికి కాకరకాయ డైట్ సూచిస్తున్నారు నిపుణులు. మరి, వాళ్లు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మధుమేహులు తమ డైలీ డైట్​లో కాకరకాయని చేర్చుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు నిపుణులు. షుగర్ ఉన్నవారికి కాకరను పోషకాహార పవర్ హౌస్​గా చెప్పుకోవచ్చంటున్నారు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, రక్తంలో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. ఫలితంగా చక్కెర రక్తంలో త్వరగా పెరగడాన్ని అడ్డుకుంటుందంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా కాకరకాయలో ఉండే "చరాన్టిన్, పాలిపెప్టయిడ్-పి, విసైన్" రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో దోహదం చేస్తాయి. అలాగే, దీనిలో ఉండే ఎమ్‌ఆర్‌కె-29 అనే ప్రొటీన్‌ కూడా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుందట. కాబట్టి, తరచుగా కాకరకాయను తీసుకోవడం వల్ల దానిలో ఉండే పోషకాలు ఇన్సులిన్ తరహాలో పనిచేసి రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయంటున్నారు నిపుణులు.

అందుకే, డయాబెటిస్ ఉన్నవారు కాకరను డైలీ డైట్​లో జ్యూస్, ఆహారం రూపంలో తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు. నేషనల్ ఇని​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్​లోనూ కాకరకాయలో ఉండే పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

షుగర్ బాధితులకు గుడ్ న్యూస్ - ఇక వారానికి ఒకటే ఇంజెక్షన్‌! - సూపర్ రీసెర్చ్!

మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఒక్క మధుమేహాన్ని తగ్గించడానికే కాదు కాకరకాయను తీసుకోవడం ద్వారా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. దీనిలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్​లో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, కాకరలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల బరువును నియంత్రణకు దోహదపడుతుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్​ను, ట్రైగ్లిజరాయిడ్స్​ను తగ్గించే సమ్మేళనాలు దీనిలో ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. చర్మ వ్యాధులు ఉన్నవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కీళ్లనొప్పులకీ కాకరకాయ ఔషధగుళికే. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. దాంతో జుట్టు, చర్మం కూడా మెరుపుని సంతరించుకుంటాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్​​ పేషెంట్లు "జిమ్​" చేస్తే ఏం జరుగుతుంది? - నిపుణుల ఆన్సర్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.