ETV Bharat / health

30 ఏళ్లకే నుదుటిపై గీతలు.. ముఖం మీద ముడతలా? - ఇలా చేస్తే 60 ఏళ్ల దాకా చర్మం ఫిట్​! - Best Tips For Skin - BEST TIPS FOR SKIN

Best Tips Younger Looking Skin : వయసు పైబడుతున్నకొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. కానీ.. 30 ఏళ్లకే వస్తే..? నుదుటిపై గీతలు, ముఖం మీద ముడతలు ఇబ్బంది పెడుతుంటే..? ఏదో తేడా జరుగుతోందని అర్థం. మరి, దాన్ని ఎలా సెట్​ చేయాలి? నవ యవ్వన చర్మాన్ని ఎలా పొందాలి??

Best Tips Younger Looking Skin
Best Tips Younger Looking Skin (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 9:59 AM IST

Best Tips For Younger Looking Skin : ఎల్లప్పుడూ ముఖం అందంగా ఉండాలని.. చర్మం మెరుస్తూ కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ.. కొందరికి చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు కనిపిస్తాయి. దీంతో.. కొందరు మేకప్‌ వేస్తూ కవర్‌ చేస్తుంటారు. మరికొందరు.. అలాగే వదిలేసి మదనపడుతుంటారు. అయితే.. మనం రోజూ కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ఏజ్‌ పెరిగినా కూడా యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముడతలు రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్స్‌ఫోలియేషన్ :
చర్మంపై డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ని తొలగించడానికి క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. ఇందుకోసం ఓట్స్‌, పాలను ముద్దలా చేసి ఫేస్‌కి పట్టించాలి. ఆపై మునివేళ్లతో 10 నిమిషాలపాటు మర్దనా చేయాలి. తర్వాత ముఖానికి ఆవిరి పడితే.. మృతకణాలు తొలగిపోతాయని నిపుణులంటున్నారు.

అల్యూమినియం ఫాయిల్​ ప్యాక్​తో అందం డబుల్​- సెలబ్రిటీల బ్యూటీ సీక్రెట్ ఇదే! - Aluminum Foil Face Pack

మసాజ్ :
డైలీ కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనె వంటి వాటితో ముఖానికి మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చట.

ఎగ్ వైట్ మాస్క్ :
కొంతమంది ముడతలు రాకుండా ఉండటానికి మార్కెట్‌లో దొరికే ఏవేవో క్రీమ్స్‌ అప్లై చేసుకుంటుంటారు. కానీ.. ఎగ్‌ వైట్‌ మాస్క్‌ ట్రై చేస్తే అన్నింటి కంటే మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులంటున్నారు. బాగా బీట్‌ చేసిన ఎగ్‌వైట్‌ను ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలట.

అలోవెరా జెల్‌ :
అలోవెరా జెల్‌లో చర్మానికి మేలు చేసే విటమిన్లు, మాయిశ్చరైజింగ్ లక్షణాలుంటాయి. ఇవి వయసు పైబడుతున్న కొద్ది వచ్చే ముడతలు రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అలోవెరా జెల్‌ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. 2019లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు రెండు సార్లు అలోవెరా జెల్‌ను అప్లై చేసుకోవడం వల్ల ముఖం, మెడపై ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో కొరియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్‌కు చెందిన 'డాక్టర్‌ డాన్- హియాన్‌ కిమ్‌' పాల్గొన్నారు. రోజుకు రెండుసార్లు అలోవెరా జెల్‌ రాసుకోవడం వల్ల ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌లు :
ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల ముఖ కండరాలు బిగుతుగా మారతాయి. అలాగే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం యవ్వనంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, డైలీ ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్‌ చేయండి.

మరికొన్ని టిప్స్‌..

  • రోజూ దోసకాయ ముక్కలతో మసాజ్‌ చేసుకోండి.
  • పెరుగును చర్మానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోండి
  • గ్రీన్‌ టీ బ్యాగ్‌లతో ఫేస్‌కు మసాజ్‌ చేయండి.
  • ఇంకా రోజూ ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, తాజా పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అందాల హీరోయిన్ అదితి బ్యూటీ సీక్రెట్స్ ఇవేనట - ఇవి పాటిస్తే అద్దిరిపోయే అందం మీ సొంతం! - Aditi Rao Hydari Beauty Secrets

మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్​ గ్యారెంటీ! - Skin Care Tips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.