ETV Bharat / health

సమ్మర్​లో డైలీ మజ్జిగ తాగుతున్నారా? - ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయినట్లే! - Buttermilk Health Benefits

Buttermilk Health Benefits : వేసవిలో చలువ చేసే పదార్థాలకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిల్లో మజ్జిగ ముందు వరుసలో ఉంటుందని, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!

Buttermilk Health Benefits
Buttermilk
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 5:49 PM IST

Health Benefits of Buttermilk : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో బయట పనుల మీద వెళ్లిన చాలా మంది వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందేందుకు ఏవేవో కూల్​డ్రింక్స్ తాగుతుంటారు. వాటిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభించవచ్చేమో కానీ, తర్వాత అవి వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా మీరు వేసవి కాలంలో ఎండలో బయటకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ(Buttermilk) తాగడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగను హిందీలో 'చాచ్' అని పిలుస్తారు. నిజానికి సమ్మర్​లో మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మండే ఎండలో వచ్చే వ్యక్తికి బటర్ మిల్క్ ఇవ్వడం వల్ల దప్పిక తీరడంతో పాటు మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంతేకాదు.. సమ్మర్ బెస్ట్ డ్రింక్​గా చెప్పుకునే మజ్జిగ వల్ల ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పోషకమైన, రుచికరమైన పానీయం : వేసవి తాపాన్ని తగ్గించే పదార్థాల్లో మజ్జిగ ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇది పోషకాలతో నిండి ఉండే రుచికరమైన పానీయం. దీనిలో విటమిన్ బి 12, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కెలరీలు, కొవ్వు శాతం కూడా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి డ్రింక్​గా​ చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్ వంటి ఉపయుక్తమైన బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయడుతుందని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగ తీసుకోవడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, వాంతులు వంటి ప్రాబ్లమ్స్​ ఇట్టే తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మజ్జిగలో ప్రోబయోటిక్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయని చెబుతున్నారు. 2016లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మజ్జిగ తాగే వ్యక్తులలో, మజ్జిగ తాగని వారి కంటే జీర్ణక్రియ సమస్యలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?

హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది : వేసవికాలంలో బాడీ హైడ్రేటెడ్​గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఎండ వేడిమి కారణంగా చెమటలు ఎక్కువగా పట్టి డీహైడ్రేషన్​కు దారితీయవచ్చు. కాబట్టి, అలాంటి ప్రాబ్లమ్ తలెత్తకుండా ఉంచడంలో మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎముకలు బలంగా తయారవుతాయి : మజ్జిగ తాగడం వల్ల మీరు పొందే మరో ఆరోగ్య ప్రయోజనమేమిటంటే.. ఎముకలు బలంగా, ఆరోగ్యకరంగా తయారవుతాయి. ఎందుకంటే దీనిలో ఉండే కాల్షియం బోన్స్​ హెల్త్​కు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోజువారీ కాల్షియం అవసరాన్ని తీర్చడంలో ఉపయోగపడడమే కాకుండా రిఫ్రెష్‌గా ఉండేందుకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరాన్ని చల్లగా ఉంచుతుంది : సమ్మర్​లో చల్ల చల్లగా ఉండే మజ్జిగను తాగడం మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే బాడీ టెంపరేచర్​ను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుందంటున్నారు.

ఇక ఈ మజ్జిగను ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఉప్పు లేదా పంచదారను కలిపి తీసుకోవచ్చు. మజ్జిగలో సన్నగా తరిగిన మిర్చి, కొన్ని కీరా ముక్కలు, కొంచెం కొత్తిమీరా వేస్తే రుచి ఇంకా బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు. మనకు ఇంత మేలు చేసే మజ్జిగను సమ్మర్​లో రోజువారీ ఆహారంలో తీసుకుని ఈ బెనిఫిట్స్​ పొందండి!

వేడి చేసిందా నాయనా.. అయితే ఇవి తినేయ్.. రుచితో పాటు ఆరోగ్యం బోనస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.