ETV Bharat / health

ఈ ఇండోర్‌ ప్లాంట్స్‌తో ఇంటికి వాస్తు, అందం - మనకు ఆనందం, ఆరోగ్యం! - Best Indoor Plants For Home

Best Indoor Plants For Home : ఇంటి ముందు స్థలం ఉన్నవారు మొక్కలు పెంచుతారు. కానీ.. సరిగా స్థలం లేనివారు మొక్కలపై ప్రేమ ఉన్నప్పటికీ పెంచకుండా ఉండిపోతారు. అయితే.. కొన్ని ఇండోర్ మొక్కలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఇంటికి అందాన్ని, మనకు ఆనందాన్ని ఇస్తాయని చెబుతున్నారు. వాస్తుకు కూడా మంచిదని సూచిస్తున్నారు.

Best Indoor Plants For Home
Best Indoor Plants For Home
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 10:20 AM IST

Best Indoor Plants For Home : ప్రస్తుత కాలంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగిపోవడంతో ఇంటి ముందు చెట్లను నాటే అవకాశం ఎక్కువ మంది జనాలకు లేదు. ఇలాంటి వారు హాల్‌, బాల్కనీ, టెర్రస్‌లలో పూలకూండీలలో చిన్న మొక్కలను పెంచుకోచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల మానసిక ప్రశాంతత కలగడంతో పాటు వాస్తు కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు.

ఫెర్న్ జాతి మొక్కలు :
ఇంట్లో కుండీలలో పెంచుకోవడానికి అత్యంత అనువుగా ఉండే మొక్కలలో ఫెర్న్‌ జాతి మొక్కలు ఒకటి. ఇవి చూడటానికి అందంగా పచ్చగా ఉంటాయి. ఈ మొక్కలను కుండీలలో పెట్టుకుని ఇంట్లో బాల్కనీలు, ప్రధాన ద్వారం పక్కన, టెర్రస్‌లపై ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫెర్న్‌ జాతి మొక్కలు గాలిలోని హానికరమైన కెమికల్స్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటికి రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి నీటిని అందించినా సరిపోతుంది.

యూరిక్ యాసిడ్ వేధిస్తోందా? - ఈ ఆయుర్వేద మూలికలతో చెక్ పెట్టండి! - Uric Acid Reduce Ayurvedic Herbs

మనీ ప్లాంట్ :
ఈరోజుల్లో చాలా మంది ఇళ్లలో డెకరేషన్ కోసం మనీ ప్లాంట్‌ను పెంచుకుంటున్నారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క పేరుకు తగ్గట్లే ఇంట్లోకి సిరిసంపదలను అందిస్తుందట. కాబట్టి.. మీరు కూడా ఇంట్లో చిన్న పూలకుండీలను కొనుగోలు చేసి మనీ ప్లాంట్‌ను నాటడం మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల ఇంటికి అందంతోపాటు వాస్తు కూడా కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

డ్రాకేనా (Dracaena) :
కుండీలలో పెంచుకోవడానికి అనువుగా ఉండే మొక్కలలో డ్రాకేనా ఒకటి. ఈ మొక్కలలో చాలా రకాలుంటాయి. డ్రాకేనా మొక్కల ఆకులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు లేదా గులాబీ రంగులలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే కొన్ని డ్రాకేనా మొక్కలకు మచ్చలు లేదా చారలతో కూడిన ఆకులు ఉంటాయని నిపుణులంటున్నారు. ఈ మొక్కలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయని.. వాటిని చూస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు.

కలబంద :
కలబంద మొక్క చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంది. అయితే, ఇంట్లో ఈ మొక్క నాటడానికి స్థలం లేని వారు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కుండీలో పెంచుకోవచ్చు. అలాగే ఈ మొక్కకు తరచుగా నీటిని కూడా పోయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయని చెబుతారు. ఇవి చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

స్నేక్ ప్లాంట్ : మీరు మంచి ఇండోర్‌ ప్లాంట్‌ను పెంచుకోవాలనుకుంటే స్నేక్‌ ప్లాంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ మొక్క చూడటానికి అందంగా ఉండటంతో పాటు గాలిని శుద్ధి చేసి మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ మొక్కలు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం ఆక్సిజన్‌ను అందిస్తూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొక్కలకు చీడపీడల బెడద ఉండదట. రెండు, మూడు వారాలకు ఒకసారి మట్టి పొడిగా అయిన తర్వాత నీళ్లు పోస్తే సరిపోతుందని తెలియజేస్తున్నారు.

బిగ్ అలర్ట్ : మహిళలు మందు తాగితే - ఏం జరుగుతుందో తెలుసా? - Alcohol Health Risks in Women

ఇవి తింటే కరెంటు తీగలా సన్నగా మారిపోతారు! - ఏ ఆరోగ్య సమస్యా రాదు! - Low Calories Foods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.