Home Remedies For Hair Growth : చుండ్రు.. చాలా మందిని ఇబ్బందిపెట్టే జుట్టు సమస్యల్లో ఇదీ ఒకటి. ఇక వర్షాకాలంలోనైతే ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంటోంది. చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. చాలా మంది డాండ్రఫ్ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ట్రై చేసినా.. జుట్టు ఊడుతుందేమో గానీ.. చుండ్రు వదలదు! మీరూ ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతున్నారా? అయితే, ఓసారి బిర్యానీ ఆకులతో ప్రిపేర్ చేసుకునే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే.. చుండ్రుకు(Dandruff) శాశ్వత పరిష్కారం దొరకుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. చుండ్రుతో పాటు దీని కారణంగా కుదుళ్లలో వచ్చే దురద, దద్దుర్లు, మంట నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుందని, జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ హోమ్ రెడీస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బే లీఫ్ హెయిర్ మాస్క్ : ఇందుకోసం.. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఆకులు, వేపాకులు వేసుకొని దాన్ని స్టౌ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆపై అవి ఉడికాక చల్లార్చుకొని ఆకులను మిక్సీ జార్‌లోకి వేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేపనూనె, అలోవెరా జెల్, ఉసిరి పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టేలా అప్లై చేసి మెల్లగా వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆపై షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.
మరో ప్రత్యామ్నాయమార్గమేమిటంటే.. బిర్యానీ ఆకులను నీటిలో ఉడకబెట్టి పేస్టులా చేసుకోవాలి. ఆపై దానిలో కొబ్బరి నూనె యాడ్ చేసుకొని మాడుకు పట్టించాలి. ఇలా చేసినా జుట్టుకు చాలా మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. దురదలు తగ్గడంతో పాటు తలపై ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.
బిర్యానీ ఆకుల కషాయం : ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో లీటర్ వాటర్ తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఆకులు వేసుకొని ఆ నీరు సగానికి వచ్చే వరకు మరిగించుకోవాలి. అది గోరువెచ్చగా అయ్యాక ఆ వాటర్‌తో జుట్టును శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా మాడుకు తగిలేలా ఆ నీటిని పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కూడా చుండ్రు సమస్య తగ్గి జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుందంటున్నారు. ఇలా పైన చెప్పిన హోమ్ రెమిడీస్ వారానికి రెండు నుంచి మూడు సార్లు ట్రై చేస్తే.. చుండ్రు సమస్య, ఇతర జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మీ హెయిర్ గ్రోత్ సూపర్‌గా ఉంటుందని చెబుతున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బిర్యానీ ఆకుల కషాయం చుండ్రు సమస్యను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లీ పాల్గొన్నారు. బిర్యానీ ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు సమస్యను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మందులు వాడినా చుండ్రు పోవడం లేదా? ఇలా చేస్తే రిజల్ట్స్ పక్కా!