ETV Bharat / health

జుట్టు బాగా రాలుతోందా? - ఎరువు వేయాల్సింది నెత్తిన కాదు - పొట్టలో! - Best Hair Growth Foods - BEST HAIR GROWTH FOODS

Hair Growth Foods : జుట్టు రాలుతోంది అనగానే టెన్షన్ పడిపోయి.. మార్కెట్లో దొరికే ఆయిల్స్, లోషన్స్ మొదలు.. ఆకు పసర్ల దాకా ఏవేవో నెత్తికి పూస్తుంటారు. ప్రాబ్లం తలమీదనే కాబట్టి.. ట్రీట్​మెంట్​ కూడా అక్కడే ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. కానీ.. జుట్టు విషయంలో లెక్క వేరే అంటున్నారు నిపుణులు. మెజారిటీ చికిత్స పొట్ట నుంచి అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు!

Best Foods For Hair Growth
Hair Growth Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 1:25 PM IST

Best Foods For Hair Growthing : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. జుట్టు రాలడం. అందుకు వంశపారంపర్యం, నిద్రలేమి, కలుషిత వాతావరణం, కఠినమైన జలం, ఒత్తిడి.. ఇలా అనేక కారణాలుండొచ్చు. వీటి గురించి జనాలు పట్టించుకోకుండా.. షాంపూలు, ఆయిల్స్, హెయిర్ మాస్క్​లు అంటూ నెత్తిచుట్టూనే తిరుగుతుంటారు. కానీ, జుట్టు రాలే సమస్య(Hair Fall) తగ్గాలంటే నెత్తిన మాత్రమే ఎరువు వేస్తే సరిపోదు.. పొట్టలో పోషకాహారం రూపంలో వేయాలంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

జుట్టు రాలే సమస్య తగ్గాలంటే మీ డైలీ డైట్​లో.. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకి అవసరమయ్యే జింక్, ఐరన్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు మీ రోజూ వారి ఆహారంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ఆ పోషకాలలో ఐరన్​ కోసం ఆకుకూరలు.. తోటకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు వంటివి పొడుల రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. 2015లో 'డెర్మటాలజీ' జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఐరన్ లోపం ఉన్నవారు అది ఎక్కువగా లభించే ఆకుకూరలు, ఇతర ఆహారాలు తీసుకున్న తర్వాత వారి జుట్టు పెరుగుదలలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా!

ఇకపోతే జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మాత్రమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి, మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ కంటెంట్ కోసం.. పప్పుదినుసులు, బఠాణీలు, బొబ్బర్లు, సెనగలు, రాజ్మా వంటి వాటిని తీసుకోవచ్చని లతాశశి సూచిస్తున్నారు. అదేవిధంగా జింక్‌ కోసం.. నట్స్, బీన్స్, చికెన్, మటన్, గుడ్డు వంటివి తీసుకోవచ్చంటున్నారు. ఇవేకాకుండా తక్కువ కొవ్వులుండే పాలు, పెరుగు, పనీర్‌ ద్వారా కూడా ప్రొటీన్‌ లభిస్తుందంటున్నారు. అయితే దీని మోతాదు మాత్రం మీ బరువుపై ఆధారపడి ఉంటుందని విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

వీటితోపాటు జుట్టు పెరుగుదలకు తోడ్పడే.. ఆరోగ్యకర కొవ్వుల కోసం ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే వాల్‌నట్స్, బాదం, చియా, అవిసెగింజలు, గుమ్మడి గింజలు, చేప వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా విటమిన్‌-ఎ, సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు తినాలని చెబుతున్నారు. ఇవేకాకుండా సాయంత్రంపూట స్నాక్స్​గా మొలకలు, వెజిటబుల్‌ సలాడ్స్‌ని తీసుకున్నా ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.

చివరగా జుట్టుకు కావాల్సిన పోషకాలు ఉండే ఆహారాలు తినడంతో పాటు హైడ్రేటెడ్ గా ఉండటానికి తగినంత నీరు తాగాలని, కాస్త శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడి.. పోషకాల రవాణా జరుగుతుందని చెబుతున్నారు. పైన పేర్కొన్న పోషకాలన్నీ మీ శరీరానికి అందితే.. జుట్టు ఆరోగ్యంగానూ, ఒత్తుగానూ పెరుగుతుందని డాక్టర్ లతాశశి సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

విపరీతంగా జుట్టు ఊడిపోతోందా? ఇంట్లోని ఈ ఐటమ్స్​తో హెయిర్​ లాస్​కు చెక్​ పెట్టండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.