ETV Bharat / health

అలర్ట్ : మీరు హై బీపీతో బాధపడుతున్నారా? - అయితే, ఇవి అస్సలు తినొద్దు - అవి తప్పక తినాలి! - Blood Pressure Control Foods - BLOOD PRESSURE CONTROL FOODS

Blood Pressure Control Foods : ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి.. హై బీపీ. అయితే, అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే మందులు వాడడం, ఉప్పు తగ్గించడమే కాకుండా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే.. మరికొన్ని తీసుకోవాలని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

Foods For Blood Pressure Control
Blood Pressure Control Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 5:11 PM IST

Best Foods For Blood Pressure Control : మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో ఎక్కువ మంది హై బీపీ ప్రాబ్లమ్​ను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రక్తపోటు అదుపులో ఉండేందుకు మందులు వాడుతుంటారు. ఉప్పును కూడా చాలా వరకు తగ్గిస్తారు. అయినా రక్తపోటు అదుపులో ఉండట్లేదని వాపోతుంటారు చాలా మంది. అయితే, మందులు వాడడం, ఉప్పును తగ్గించిన మాత్రాన బీపీ కంట్రోల్​లోకి వచ్చేయదంటున్నారు నిపుణులు. కాబట్టి బీపీ(Blood Pressure) కంట్రోల్​లో ఉండాలంటే.. వీటిని ఫాలో అవ్వడంతో పాటు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బీపీ అదుపులో ఉండడానికి ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, మరికొన్నింటిని తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు. అందులో ప్రధానంగా సోడియం ఉన్న ఆహార పదార్థాలను బాగా తగ్గించాలి. వాటికి బదులుగా.. పోటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను డైలీ డైట్​లో భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

అవి తినొద్దు..

బీపీ ఉన్నవారు కూరల్లో ఉప్పు తగ్గించాలని అందరికీ తెలుసు. అయితే.. వాటితోపాటు మరికొన్ని ఐటమ్స్​ అస్సలే తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చళ్లు, సాస్, చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో సోడియం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. వీటన్నింటికీ ఖచ్చితంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

"సాధారణంగా మనం తినే అన్ని ఆహార పదార్థాలలో సోడియం ఉంటుంది. అందుకే.. అదనంగా కూరల్లో వేసుకునే ఉప్పు, రోజువారి సాల్ట్ వాడకాన్ని తగ్గించాలి. దీంతోపాటుగా.. నిల్వ పచ్చళ్లు, సాస్, పీనట్ బటర్, చిప్స్, పిజ్జా, బర్గర్లు, ప్యాకేజ్డ్ సూప్​లు, ఫాస్ట్ ఫుడ్, ఎండుచేపలు వంటి వాటిలో చాలా అధిక మోతాదులో సోడియం ఉంటుంది. కాబట్టి.. వీటన్నింటికీ దూరంగా ఉండాలి"- డాక్టర్ స్వరూపారాణి, ప్రముఖ న్యూట్రిషనిస్ట్.

ఎలాంటి మందులూ వాడకుండానే - హైబీపీ తగ్గించుకోండిలా!

వేటిని తీసుకోవాలంటే?

  • రక్తపోటు తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో పోటాషియం అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. పుచ్చకాయ, ద్రాక్ష, కమలాలు, స్వీట్ పొటాటో, దానిమ్మ, అరటి, బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి పండ్లు, కాకర, మునగ, ఆకుకూరలు వీటన్నింటిలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్ స్వరూపారాణి.
  • అలాగే.. హైబీపీ ఉన్నవారికి కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్స్ ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. అంటే.. నెయ్యి, డాల్డా, పామాయిల్ వంటి వాటిల్లో శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వాటికి బదులుగా మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉండేవి చేర్చుకోవడం బెటర్. అంటే.. ఆలివ్, సన్​ఫ్లవర్, నువ్వుల నూనె.. వంటి వాడడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్యులు.
  • అన్నింటికంటే.. ముఖ్యంగా ప్రతి బీపీ పేషెంట్ రోజు వారి ఆహారంలో 5 నుంచి 6 గ్రాముల లోపే ఉప్పు ఉండేలా చూసుకుంటే కచ్చితంగా రక్తపోటును కంట్రోల్​లో పెట్టుకోవచ్చంటున్నారు. అదేవిధంగా.. వెల్లుల్లి బీపీ అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. కాబట్టి రోజువారి ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
  • ఉదయం లేవగానే బీట్​రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు డాక్టర్ స్వరూపారాణి. అలాగే.. టమాటాల్లో ఉండే లైకోపిన్ అనే రసాయనానికి బీపీ తగ్గించే గుణం ఉంది. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. అదేవిధంగా డైలీ గ్రీన్ టీ(Green Tea) తాగడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు.
  • మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బీపీ వ్యాధిగ్రస్థులు వెజిటబుల్ ఫుడ్స్​కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే.. బీపీ మూలాన కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా అజినోమోటో వాడే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
  • వీటితో పాటు నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్నారు డాక్టర్ స్వరూపారాణి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ 3 ఆసనాలతో BP కంట్రోల్! ఈజీగా చేసేయండిలా!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.