ETV Bharat / health

గ్యాస్, కడుపుబ్బరం తరచూ వేధిస్తున్నాయా? - అది "ఐబీఎస్" కావొచ్చు! - ఇలా చేశారంటే అంతా సెట్! - FOOD DIET FOR GASTRIC PROBLEMS

గ్యాస్, కడుపుబ్బరంతో బాధపడుతున్నారా? - ఈ డైట్ ఫాలో అయ్యారంటే వాటికి ఈజీగా చెక్!

GASTRIC PROBLEMS REDUCE FOOD DIET
Food Diet for Gastric Problems (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Oct 21, 2024, 2:48 PM IST

Food Diet for Gastric Problems : ప్రస్తుత రోజుల్లో గజిబిజి జీవన విధానం, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా పొట్టను వ్యాధుల పుట్టగా మారుస్తున్నాం. అడ్డు అదుపు లేకుండా తినడం కారణంగా వయసుతో సంబంధం లేకుండా వివిధ జీర్ణ సమస్యల బారిన పడుతున్నాం. ఈ క్రమంలోనే చాలా మంది ఎదుర్కొంటున్న జీర్ణ సమస్యల్లో ఒకటి ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌(ఐబీఎస్). అసలేంటి ఈ సిండ్రోమ్? లక్షణాలేంటి? దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి ఆహారపుటలవాట్లూ పాటించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మన శరీరంలో జీర్ణకోశం ఒక పద్ధతి ప్రకారం పనిచేయకపోవడాన్నే "ఇరిటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌" ప్రాబ్లమ్​గా చెప్పొచ్చు. ఈ సమస్య తలెత్తినప్పుడు గ్యాస్ ట్రబుల్, విరేచనాలు కావడం, మలబద్ధకం, నొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య నుంచి బయటపడాలంటే మందులే కాదు ఆహారపుటలవాట్లూ ముఖ్యమే అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. ఈ క్రమంలోనే ఎలాంటి ఆహారపుటలవాట్లూ పాటించాలో కూడా వివరిస్తున్నారు.

ముఖ్యంగా మీరు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్​ సంబంధిత లక్షణాలతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి. అప్పుడు వైద్యులు వాటిల్లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందిని బట్టి మీకు డైట్​ని సూచిస్తారు. దీని కంటే ముందు ఓ వారం పాటు మీరు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? ఆ రోజుల్లో ఎలా ఇబ్బంది పడ్డారు? వంటి వివరాలన్నీ ఓ డైరీలో నమోదు చేసుకోండి. అంటే.. ఏ సమయంలో గ్యాస్‌ ట్రబుల్ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది? పొట్ట ఉబ్బరంతో అసౌకర్యంగా ఉంటుంది? మ్యూకస్‌ మోషన్‌ ఇబ్బంది పెడుతుంది? అనే వాటిని గుర్తించండి. దానిని బట్టి మీ ఆహార ప్రణాళికను సెట్ చేసుకోవడం మంచిదంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.

డైట్​లో ఇవి ఉండాల్సిందే!

అలాగే.. మనం సాధారణంగా తిన్నది జీర్ణం కావాలంటే శరీరానికి సరైన మోతాదులో పీచు పదార్థాలు అందాలి. అది గమనించుకొని మీ డైట్​ని సెట్ చేసుకోవాలి. అయితే పీచులోనూ సాల్యుబుల్, ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌ అని రెండు రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా తృణధాన్యాలు, పాలకూర, మెంతికూర, క్యారెట్లు, జామ, దానిమ్మ, యాపిల్, బాదం, అవిసెగింజలు, చియా, సెనగలు వంటి ఆహార పదార్థాల నుంచి పీచు అధికంగా లభిస్తుందంటుంది. కాబట్టి.. వీటిని డైలీ డైట్​లో ఉండేలా చూసుకోవాలంటున్నారు.

అదేవిధంగా.. వీటితో పాటు తగినన్ని ద్రవపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. సాధారణంగా నీళ్లు ఎక్కువగా తీసుకోనప్పుడు కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తుంది. అలాగే.. మానసిక ఒత్తిడి, జీన్స్, కొన్నిరకాల తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు యాంటీబయాటిక్‌లు వాడటం వల్లా ఈ ఇబ్బందులు ఎదురుకావొచ్చంటున్నారు. కాబట్టి.. ఏది ఏమైనప్పటికీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కారణంగా తలెత్తే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గాలంటే డైట్​ని ఫాలో అవ్వడంతో పాటు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌నీ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

గ్యాస్ ట్రబుల్​​తో ఇబ్బంది పడుతున్నారా? ఇవి పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు!

గబగబా తినేస్తున్నారా? ఎసిడిటీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.