Best Drinks For Sugar Patients : షుగర్ పేషెంట్లపై రెగ్యూలర్‌గా తాగే డ్రింక్‌లు కొన్ని పాజిటివ్‌గా మరికొన్ని నెగటివ్‌గా ప్రభావం చూపిస్తాయి. తీపి ఎక్కువ ఉన్న డ్రింక్‌లు షుగర్ పెంచుతాయని అందరికీ తెలిసిందే. ఇవి ఇన్సులిన్ నియంత్రణను తగ్గించి శరీరం గ్లైసెమిక్ కంట్రోల్ కోల్పోయేలా చేస్తుంది. ఇలా జరగడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరిగి గుండె జబ్బులు పెరుగుతాయి. దీర్ఘకాలికంగా నరాల సమస్య కూడా వచ్చే ప్రమాదముంది.
ఇదిలా ఉంటే, కొన్ని డ్రింక్‌లు మాత్రం బ్లడ్ షుగర్ లెవల్స్ మేనేజ్ చేసి హైడ్రేషన్‌కు దారి తీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందించి ఇన్సులిన్ సెన్సిటివిటీని వృద్ధి చేస్తాయి. అందుకే డయాబెటిస్ పేషెంట్లు తాము తాగే డ్రింక్ లు సెలక్ట్ చేసుకునే ముందు కొన్ని విషయాలు జ్ఞప్తికి ఉంచుకోవాలి.
నీరు:
రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే డ్రింక్‌లలో నీరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. శరీరానికి ఎటువంటి షుగర్ లేదా కేలరీలు యాడ్ చేయకుండానే హైడ్రేషన్‌కు సహకరిస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. అలా జరిగి శరీరంలో ఉన్న గ్లూకోజ్‌ను మూత్రం ద్వారానే బయటకు నెట్టేస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించే పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయట. వీటి ఫలితంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
హెర్బల్ టీ:
చామంతి, అల్లం, పుదీనాలతో తయారుచేసే ఛాయ్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. సాధారణంగానే అవి కెఫైన్ ఫ్రీగా ఉండటమే కాకుండా శరీరంలో వేడిని కలిగించే గుణాన్ని తగ్గిస్తూ, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు చేస్తుంది.
వెజిటెబుల్ జ్యూస్:
తాజా ఆకుకూరలు, దోసకాయలు, సెలరీతో తయారు చేసుకునే జ్యూస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండి, శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వీటిల్లో ఉండే ఎసిటిక్ యాసిడ్ కార్బోహైడ్రేట్స్‌ను షుగర్‌గా మార్చే ప్రక్రియను నెమ్మెది చేస్తుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.