These Beverages Might Be Better Than Coffee : చాలా మంది రోజు.. కాఫీ లేదా టీతో మొదలవుతుంది. వీరిలో ఎక్కువ మంది రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కాఫీ(Coffee) తాగుతారు. కానీ.. ఇంకొందరు మాత్రం తాగుతూనే ఉంటారు. రోజులో ఎన్నిసార్లు తాగుతారో వారికే తెలియదు. అయితే.. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా.. అతిగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కాఫీ ఒకటీ రెండు సార్లకన్నా ఎక్కువ తాగాలనిపిస్తే.. ఇతర పానీయాలను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రీన్ టీ : దీనిలో కెఫీన్ తక్కువ. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో గ్రీన్ టీ ఒకటని చెప్పుకోవచ్చు. ఇది అమైనో ఆమ్లాలు, కెఫీన్ కలయికతో ఉండి తాగగానే తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక దీనిని రోజూ తీసుకుంటే.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా బాడీకి కావాల్సిన పోషకాలను అందించడంలో కూడా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. గ్రీన్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది.
కొబ్బరి నీరు : తాజా కొబ్బరి నీరులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బాడీ కోల్పోయిన భర్తీ చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. అందుకే దీనిని ఒక మంచి హైడ్రేటింగ్ పానీయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పానీయంలో కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఈ వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మీరు కాఫీకి బదులుగా ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్లో పడ్డట్లే!
బీట్‌రూట్ జ్యూస్ : కాఫీకి బదులుగా తీసుకునే మరో ఆరోగ్యకమైన పానీయం బీట్‌రూట్ జ్యూస్. ఇది విటమిన్ B9 (ఫోలేట్)తో నిండి ఉంటుంది. కణాల పెరుగుదల, పనితీరులో ఈ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తనాళాల క్షీణతను నివారించడంలో ఫోలెట్ చాలా కీలకంగా పనిచేస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా బీట్‌రూట్ సహజంగా నైట్రేట్‌లను కలిగి ఉంటుంది. ఇవి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడంలో బాడీకి సహాయపడడంతోపాటు హృదయ ఆరోగ్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
నిమ్మరసం : మీరు నిమ్మరసాన్ని డైలీ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉన్న నిమ్మరసం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు బరువు నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. నిమ్మరసం గ్లైసెమిక్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుందని తేలింది.
దాల్చిన చెక్క, తేనె నీరు : మీరు కాఫీకి బదులుగా దీనిని తీసుకున్న బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్క, తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థ మెరుగుదల, ఇన్ఫెక్షన్ నివారణలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు.
కాఫీ Vs టీ- రెండిట్లో ఏది బెస్ట్? మార్నింగ్ లేవగానే తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?