ETV Bharat / health

డయాబెటిస్ బాధితులు 'సోయా దోశ' తినండి - దెబ్బకే షుగర్ కంట్రోల్! - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Best Breakfast Recipe For Diabetics

Best Breakfast Recipe For Diabetics : డయాబెటిస్ ఉన్నవారు దోశ తినడానికి ఎంతగానో ఆలోచిస్తారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని ఆలోచిస్తారు. కానీ.. సోయా దోశ తింటే ఎలాంటి చింతా ఉండదని అంటున్నారు నిపుణులు! మరి.. ఈ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుసా?

Soya Dosa Recipe In Telugu
Best Breakfast Recipe For Diabetics (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 2:45 PM IST

How To Make Soya Dosa Recipe At Home : మారిన జీవనశైలి కారణంగా ఈరోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్​తో బాధపడుతున్నారు. దీంతో షుగర్ బాధితులుకఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ నోటిని కట్టేసుకుంటుంటారు. ఏ ఆహారం తిందామన్నా ఎక్కడ షుగర్ లెవల్స్ పెరుగుతాయో అనే భయంతో వెనకాడుతుంటారు. అలాంటి వారికి ఎంతో మేలు చేసే ఒక స్పెషల్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీని పట్టుకొచ్చాం. అదే.. సోయా దోశ(Soya Dosa).

ఈ దోశ తయారీ కోసం ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ దోశ రెసిపీలో షుగర్ లెవల్స్ పెంచే ఆహార పదార్థాలు లేవు! కాబట్టి డయాబెటిస్(Diabetes) ఉన్నవారు సోయా దోశను ఎలాంటి ఇబ్బంది లేకుండా తినవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, సోయా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు - సోయా పాలు
  • పావు కప్పు - గోధుమపిండి
  • సరిపడినంత - నూనె
  • రుచికి సరిపడా - ఉప్పు
  • చిటికెడు - బేకింగ్ సోడా
  • 1 టీస్పూన్ - జీలకర్ర
  • కొద్దిగా - పచ్చిమిర్చి తరుగు
  • అరకప్పు - ఉల్లిపాయ తరుగు
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

షుగర్ బాధితులకు దివ్యౌషధం - ఈ "మసాలా కాకరకాయ" తింటే వెంటనే నార్మల్​ అయిపోతుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీరను తరుక్కోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో గోధుమ పిండి, సోయా పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ విధంగా కలుపుకున్నాక.. ఆ మిశ్రమంలో ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, బేకింగ్ సోడా, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి.
  • ఆపై మిశ్రమంలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ.. దోశలు వేయడానికి వీలుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని 15 నిమిషాల పాటు పక్కన ఉంచి అనంతరం దోశలు వేసుకోవాలి.
  • ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశలను టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్.. ఇలా దేనితో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి.
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆరోగ్యానికి మేలు ఈ దోశలను ఇప్పుడే ఓ ట్రై చేసి.. టేస్ట్ చేయండి.

రీసెర్చ్​ : మీ ఒంట్లో షుగర్ ఎంత ఉన్నా- లవంగాలు ఇలా తీసుకుంటే చాలు! - దెబ్బకు నార్మల్​ అయిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.