ETV Bharat / health

చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా? - ఆయుర్వేదం ప్రకారం ఇలా చేస్తే చిటికెలో సమస్య మటుమాయం! - gum bleeding treatment ayurveda

Gum Bleeding Treatment: మీ చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తగ్గడం లేదా? అయితే డోంట్​ వర్రీ. ఎందుకంటే దీనికి ఆయుర్వేదంలో ఓ పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Gum Bleeding Treatment Ayurveda
Gum Bleeding Treatment Ayurveda (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 4:00 PM IST

Gum Bleeding Treatment as Per Ayurveda : ఈ రోజుల్లో చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి అని చెప్పుకోవచ్చు. కొందరికి పళ్లు తోమేటప్పుడు లేదా పుక్కిలించినప్పుడు చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అయితే, ఈ చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి. ఆమె చెబుతున్న ఔషధ తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 80 గ్రాముల తుమ్మ బెరడు చూర్ణం
  • 40 గ్రాముల కాచు
  • 20 గ్రాముల పటిక చూర్ణం
  • 10 గ్రాముల కర్పూరం చూర్ణం
  • 5 గ్రాముల లవంగాల చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో తుమ్మ బెరడు, కాచు, పటిక , కర్పూరం, లవంగాల చూర్ణం వేసుకోని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం శుభ్రంగా ఉన్న ఓ పలుచటి క్లాత్​ తీసుకుని ఆ మిశ్రమాన్ని జల్లించుకోవాలి. (మాములు జల్లెడ కంటే మెత్తగా రావడానికి క్లాత్​లో జల్లించుకోవాలి.) ఎందుకంటే మన పళ్లు, చిగుళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి గరకుగా ఉన్న వాటితో తోముకుంటే చిగుళ్లు, పళ్లు దెబ్బతినే అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు
  • ఈ మిశ్రమాన్ని నీట్​గా ఉన్న ఓ గాజు పాత్రను తీసుకొని పెట్టుకోవాలి. దీనిని ఒకసారి తయారు చేసుకుంటే సుమారు 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆ తర్వాత కూడా పాడవకపోయినా.. అందులోని ఔషధ గుణాలు కొద్దిగా తగ్గిపోతాయని చెబుతున్నారు.
  • ఈ ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పళ్లకు టూత్​ పౌడర్​లాగా వాడుకోవాలని వివరిస్తున్నారు
  • ఇలా కాకుండా మరో విధంగా కూడా దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం ఈ పౌడర్​లో కొంచెం నువ్వుల నూనె కలిపి పేస్ట్​లాగా చేసి.. దానిని చిగుళ్లపై అప్లై చేసి మసాజ్ చేయాలి.​
  • కొద్దిసేపయ్యాక పుక్కిలించుకోవాలని.. ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లలో ఇన్​ఫెక్షన్​, నోటి దుర్వాసన ఇలాంటివన్ని త్వరగా తగ్గిపోతాయని వివరిస్తున్నారు.

తుమ్మ బెరడు: చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచే గుణం తుమ్మ బెరడులో ఎక్కువగా ఉంటుంది. పళ్ల ఇన్​ఫెక్షన్​, చిగుళ్ల పైన ఉండే గార పోయేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా రక్తం కారే లక్షణాన్ని సైతం తగ్గిస్తుంది. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు తుమ్మ బెరడు ఎంతో సహాయపడుతుందని డాక్టర్​ గాయత్రీ దేవి చెబుతున్నారు.

కాచు: చండ్ర చెట్టు బెరడు నుంచి తయారు చేసింది కాచు చూర్ణం. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్తం కారకుండా ఎంతో సాయపడుతుందని సూచిస్తున్నారు.

పటిక బెల్లం: పటిక బెల్లం చిగుళ్ల సమస్యకు మంచి ఔషధం. రకరకాల చిగుళ్ల సమస్య వచ్చినప్పుడు పటికను నీటిలో వేసుకుని పుక్కిలించినా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది మంచి టూత్​పేస్ట్​గానూ ఉపయోగపడుతుందని వివరించారు.

కర్పూరం: పళ్లు, చిగుళ్లకు కర్పూరం మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని.. నోటిలో ఉన్న సూక్ష్మ జీవులను నశించేలా చేస్తుందని అంటున్నారు. తద్వారా నోటి దుర్వాసన తగ్గుతుందని అంటున్నారు.

లవంగాలు: పన్ను పోటు అనగానే చాలా మందికి లవంగాలు గుర్తుకు వస్తాయి. పళ్లు, చిగుళ్ల ఆరోగ్యానికి లవంగాలు మంచివని నిపుణులు చెబుతున్నారు. అలాఅని వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిలో పుండ్లుగా ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ పిల్లలను దగ్గు బాధిస్తోందా? - ఈ తియ్యని ఆయుర్వేద ఔషధంతో వెంటనే తగ్గిపోతుంది! - cough medicine in ayurveda

మీ కాలేయం అపాయం అంచున నిలబడి ఉందేమో! - మీ ఒంట్లో కనిపించేవన్నీ వార్నింగ్ బెల్సే!! - Symptoms of Liver Damage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.