ETV Bharat / health

మూత్ర విసర్జన టైమ్​లో ఇలా అవుతోందా? - ప్రొస్టేట్ సమస్య కావొచ్చు - వెంటనే అలర్ట్ కాకపోతే అంతే! - Effects of Prostate Enlargement - EFFECTS OF PROSTATE ENLARGEMENT

Effects of Prostate Enlargement : పురుషుల్లో మాత్రమే కనిపించే గ్రంథి.. ప్రొస్టేట్ గ్రంథి. మగవారి వయసు పెరుగుతున్నకొద్దీ.. ఈ గ్రంథి పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే.. ప్రొస్టేట్ పెరుగుదల కారణంగా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి.. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Effects of Prostate Enlargement
Prostate Enlargement (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 12:03 PM IST

Benign Prostatic Hyperplasia Effects : పురుషుల్లో మూత్రసంచి దిగువన చిన్న చిక్కుడు గింజ పరిమాణంలో ప్రొస్టేట్ గ్రంథి ఉంటుంది. మగవారిలో 50 ఏళ్ల తర్వాత ప్రొస్టేట్ సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. పురుష హార్మోన్ చర్య కారణంగా ప్రొస్టేట్ విస్తరిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో "బినైన్ ప్రొస్టేటిక్ హైపర్​ప్లాసియా(BPH)" అంటారు. అయితే.. ప్రొస్టేట్ గ్లాండ్ విస్తరించినా కొంతమందిలో అది మరీ ఇబ్బందికరమైన సమస్యలను తెచ్చిపెట్టదు. కానీ.. ఇంకొందరిలో మాత్రం ప్రొస్టేట్ వృద్ధి.. మూత్రాశయంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కొన్ని తీవ్రమైన మూత్రాశయ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ.. BPH వల్ల కలిగే ఆ సమస్యలేంటి? వాటిని సహజసిద్ధంగా తగ్గించుకోవాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ : పెరిగిన ప్రొస్టేట్ కారణంగా మూత్రాన్ని పూర్తిగా విసర్జించలేకపోతారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందంటున్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి. వంశీకృష్ణ. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే తీవ్రమైన కిడ్నీ(Kidney) ఇన్ఫెక్షన్స్ ప్రాణాంతకం కావొచ్చంటున్నారు.

మూత్రాశయం దెబ్బతినడం : ప్రొస్టేట్ పెరుగుదల మూత్రాశయంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే దాని కండరాలనూ బలహీనపరుస్తుంది. దీనికారణంగా దీర్ఘకాలంలో.. మూత్రాశయం పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు డాక్టర్ వంశీకృష్ణ.

మూత్రం నిలుపుదల : కొన్ని సందర్భాల్లో.. ప్రొస్టేట్ చాలా వృద్ధి చెందితే అది పూర్తిగా మూత్రం నిలుపుదలకి దారితీయవచ్చంటున్నారు. ఆ టైమ్​లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటున్నారు.

ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కారణంగా సంభవించే ఇతర సమస్యలు :

  • రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన
  • మూత్రం పోయడానికి చాలా సమయం పట్టడం
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపించడం
  • మూత్రం ఎంతపోసినా ఇంకా ఉన్నట్టు అనిపించడం

ప్రొస్టేట్ గ్రంథి పెరుగుదల నెక్ట్స్ స్టేజ్​కి వెళ్లినప్పుడు కొందరిలో మూత్రంలో బ్లడ్ రావడం, కొన్ని తీవ్రమైన యూరిన్ ఇన్​ఫెక్షన్లు కనిపిస్తాయంటున్నారు వైద్యులు వంశీకృష్ణ. కాబట్టి, మీలో ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే PSA(Prostate Specific Antigen) పరీక్షలు చేయించుకోవడం బెటర్. PSA స్థాయిలను బట్టి ఓవైపు మందులు వాడుతూ.. మరోవైపు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ప్రొస్టేట్ సమస్యలను ఈజీగా అధిగమించవచ్చంటున్నారు.

జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు :

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • డైలీ తగినంత నీరు తాగడం
  • రెగ్యులర్​గా వ్యాయామం చేయడం
  • ధూమపానం, మద్యపానానికి వీలైనంత దూరంగా ఉండాలి.
  • పడుకోవడానికి ఒకటి నుంచి రెండు గంటల ముందు ద్రవాలు(Harvard Medical School రిపోర్టు) తీసుకోవడం మానుకోవాలి.
  • అలాగే ఏదైనా ట్రిప్ లేదా బయటకు వెళ్లే ముందు తక్కువ మొత్తంలో ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. దీనివల్ల మూత్రం ఆపుకోవాల్సిన పరిస్థితి తప్పుతుంది.
  • బాత్రూమ్‌కి వెళ్లడానికి ఒక షెడ్యూల్‌ పెట్టుకోవాలి.
  • మూత్ర విసర్జనకు​ వెళ్లినప్పుడు మీ మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడానికి సమయాన్ని వెచ్చించాలి.
  • ఇలా జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోపాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సహజంగా ప్రొస్టేట్ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు డాక్టర్ వంశీకృష్ణ.

ఇవీ చదవండి :

మగాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్​తో పెరుగుతున్న మరణాలు - రాకుండా ఈ గింజలు తినండి!

ప్రొస్టేట్ క్యాన్సర్​ ముప్పును ఇలా అడ్డుకోండి - రీసెర్చ్ రిపోర్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.