ETV Bharat / health

భోజనం తర్వాత సరిగ్గా ఇన్ని అడుగులు వేస్తే చాలు - ఈ విషయం తెలియక పొట్ట పెంచుకుంటున్నారు! - Benefits Of Walking After Eating - BENEFITS OF WALKING AFTER EATING

Benefits Of Walking After Eating : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి.. అధిక బరువు. ఈ క్రమంలోనే దీన్ని తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, అలాకాకుండా భోజనం తర్వాత డైలీ కనీసం 100 అడుగుల పైన నడిస్తే ఈజీగా ఆ సమస్య నుంచి బయపడొచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Walking After Eating Heath Benefits
Benefits Of Walking After Eating (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 3:42 PM IST

Walking After Eating Heath Benefits : నేటి బిజీ లైఫ్​లో ఎక్కువ మంది ఉద్యోగం, వ్యాపారాలలో నిమగ్నమై ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలాగే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం.. వంటివి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ్యంగా ఊబకాయం, అధికబరువు, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడుతుంటారు. అందుకు ప్రధాన కారణం.. భోజనం తర్వాత కాసేపు నడవకపోవడమేనట! తిన్నాక కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడవకపోవడం వల్లనే అధికబరువు పెరిగి వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్​ను కొని తెచ్చుకుంటున్నారంటున్నారు నిపుణులు. అంతేకాదు.. భోజనం తర్వాత కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో కూడా వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణక్రియకు మేలు : భోజనం చేశాక కాసేపు నడిస్తే.. జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. తిన్నాక నడవడం వల్ల పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయంటున్నారు. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలూ తగ్గుతాయని సూచిస్తున్నారు.

2014లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్​'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తులు తిన్నాక 10 నిమిషాలు నడిచినప్పుడు వారి జీర్ణక్రియ రేటు గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ M.J. శాండ్స్ పాల్గొన్నారు. భోజనం చేశాక కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగై.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి వంటి లక్షణాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది : తిన్నాక కొద్దిసేపు వాకింగ్(Walking) చేయడం రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది గుండెను బలపర్చడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ముప్పును తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. అలాగే.. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.

వెయిట్ లాస్​కి తోడ్పడుతుంది : భోజనం తర్వాత కాసేపు నడవడం బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు. ఎందుకంటే.. తిన్నాక నడవడం వల్ల ఎక్కువ మొత్తంలో కేలరీలు బర్న్ అవుతాయి. అది వెయిట్​ను అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందని సూచిస్తున్నారు.

హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?

మధుమేహానికి చెక్ : తిన్నాక పది నిమిషాలు నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్​ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి డయాబెటిస్(Diabetes) బారినపడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మంచి నిద్ర : తిన్న తర్వాత వాకింగ్ చేయడం మీ సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, తగ్గిన ఒత్తిడి కూడా మరింత ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే.. తిన్న తర్వాత చేసే వాకింగ్ కండరాలు, కీళ్లను బలపర్చడంలో చాలా బాగా సహయపడుతుందంటున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది : ఈ సాధారణ వ్యాయామం ఎండార్ఫిన్‌లను రిలీజ్ చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు. అంతేకాదు.. తిన్నాక కాసేపు నడవడం జీవక్రియ రేటును పెంచడానికి దోహదపడుతుందట.

అయితే, చివరగా గుర్తించుకోవాల్సిన విషయమేమిటంటే.. భోజనం, వాకింగ్ మధ్య 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే, ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు నడుచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నడుం నొప్పికి కొత్త చికిత్స- రోజూ 'వాకింగ్' చేస్తే చాలు- పెయిన్ మటుమాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.