Health Benefits Of Listening Music : సమస్యలు అందరికీ ఉంటాయి. వాటికి మనం ఎలా స్పందిస్తున్నామన్నదే కీలకం. కొందరు ఎలాంటి సమస్యనైనా లైట్ తీసుకుంటారు. మరికొందరు చిన్న సమస్యలకే మదనపడుతుంటారు. ఇదొక అలవాటుగా మారిపోయి.. నిత్యం డల్‌గా ఉంటారు. మానసిక ఇబ్బందులతో కుంగిపోతుంటారు. ఇలాంటి వారికి సంగీతం చక్కటి మెడిసిన్ అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గిస్తుంది : మనం ఒత్తిడికి లోనైనప్పుడు బాడీ కార్టిసాల్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. అది హార్ట్ బీట్ పెరగడం, అలసట వంటి లక్షణాలకు దారితీస్తుంది. అలాంటి టైమ్‌లో నచ్చిన మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి హార్మోన్ హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు తగ్గిపోయి.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. మ్యూజిక్ మంచి స్ట్రెస్(Stress) బస్టర్‌గా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
2013లో "జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఒత్తిడితో కూడిన పనులను చేసేటప్పుడు సంగీతం వినడం వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జోక్ హీర్మేస్ పాల్గొన్నారు. క్లాసికల్ మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని హీర్మేస్ పేర్కొన్నారు.
ఆందోళన, డిప్రెషన్ తగ్గిస్తుంది : ఆందోళన, డిప్రెషన్లో ఉన్నప్పుడు సంగీతం వింటే చాలా మంచి అనుభూతి పొందుతారంటున్నారు నిపుణులు. మంచి క్లాసికల్ మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గి.. ప్రశాంతంగా ఉంటారని చెబుతున్నారు. మెడిటేషన్ మాదిరిగా సంగీతం మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత భావం కలుగుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో సెరోటోనిన్, ఎండార్పిన్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది : మ్యూజిక్ వినడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా సంగీతం వినడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రాంతాలు చురుగ్గా పనిచేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయంటున్నారు. తద్వారా అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందట.
నొప్పి నుంచి రిలీఫ్ : సంగీతం మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిచండమే కాకుండా శారీర అసౌకర్యాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంలో మ్యూజిక్ మంచి ఔషధంలా పనిచేస్తుందట.
వ్యాయామం చేసేలా ఉత్తేజపరుస్తుంది : కొంతమందికి డైలీ వర్కౌట్(Exercise) చేసేటప్పుడు కొన్నిసార్లు బోర్ కొట్టి ఏం చేస్తాంలే అని అనిపిస్తుంటుంది. అలాంటి టైమ్‌లో ఏదైనా మ్యూజిక్ వింటూ చేస్తే ఎంతసేపైనా చేసేలా ప్రోత్సహిస్తుందంటున్నారు నిపుణులు. టైమ్ కూడా తెలియదని, శారీరక శ్రమ గురించి ఆలోచన తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
నిద్ర నాణ్యత మెరుగు : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నిద్ర చాలా అవసరం. కానీ, నేటిరోజుల్లో వివిధ కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు మ్యూజిక్ వినడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అలర్ట్ - ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి!
ఇంట్రస్టింగ్ : వయసు ప్రకారం - ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు తెలుసా?