ETV Bharat / health

డైలీ ఒక అరటి పండు తినాలంటున్న నిపుణులు - ఎందుకో తెలుసా? - Benefits Of Eating Banana - BENEFITS OF EATING BANANA

Benefits Of Eating Banana Everyday : మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే పండ్లలో ఉండే వివిధ రకాల పోషకాలు, విటమిన్‌లు మన బాడీకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అయితే అన్నీ ఏమో కానీ తక్కువ ధరకే ఎక్కువ పోషకాలు లభించే అరటి పండును మాత్రం డైలీ ఒకటి తినాలని నిపుణులు అంటున్నారు. అందుకు గల కారణాలు వివరిస్తున్నారు.

Benefits Of Eating Banana
Benefits Of Eating Banana Everyday (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 3:35 PM IST

Benefits Of Eating Banana Everyday : కాలంతో సంబంధం లేకుండా అన్నీ సీజన్‌లలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇందులో పోషక విలువలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే, అరటి పండ్లను కొంత మంది వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి తింటే.. మరికొందరు మాత్రం తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే తక్కువ ధరకే ఎక్కువ పోషకాలు లభించే అరటి పండును డైలీ ఒకటి తినాలని నిపుణులు అంటున్నారు. అందుకు గల కారణాలు వివరిస్తున్నారు..

పోషకాలు అధికం : బనానాలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6, డైటరీ ఫైబర్‌ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సినన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు అదుపులో : పొటాషియం అధికంగా ఉండే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. రోజూ అరటిపండ్లను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2013లో "అమెరికన్ హార్ట్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజుకో అరటిపండు తినే వ్యక్తులలో.. రక్తపోటు కంట్రోల్లో ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని ప్రముఖ 'డాక్టర్‌ జియాన్‌ఫెంగ్ లి' పాల్గొన్నారు. అరటి పండు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

తక్షణ శక్తి : అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామానికి ముందు, తర్వాత వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది : అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ అరటి పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.

కడుపులో మంట : అరటి పండ్లలో ఉండే పోషకాలు కడుపులో మంటను, నొప్పిని తగ్గిస్తాయి. అందుకే తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు అరటి పండ్లను తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

కిడ్నీల్లో చెత్త క్లియర్ చేస్తుంది, షుగర్ తగ్గిస్తుంది! - ఒక్క గ్లాసు వాటర్​తో సూపర్ హెల్త్ బెనిఫిట్స్! - Coriander Water Benefits

గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది : పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బరువు అదుపులో : బనానాలో చాలా తక్కువ క్యాలరీలు, కొవ్వులుంటాయి. అలాగే ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండా ఉండొచ్చు. దీంతో బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.

చర్మం ఆరోగ్యంగా : బనానాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి.. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, డైలీ అరటి పండు తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తామని నిపుణులంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​ టైమ్ అధిక మూత్రవిసర్జన - అది షుగర్ లక్షణం మాత్రమే కాదు మరో ప్రమాదకరమైన జబ్బుకు సంకేతం! - frequent urination at Night time

కంటికి కూడా స్ట్రోక్​ ముప్పు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కళ్లు సేఫ్​! - Eye Stroke Symptoms

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.