Benefits of Body Tapping : బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, జాగింగ్, యోగా, వ్యాయామం వంటి చాలా రకాల మార్గాలున్నాయి. అయితే వీటికి సమయం, శక్తి లేని వారు సులువుగా కూర్చున్న చోటే మిమ్మల్ని హెల్తీగా మార్చేందుకు ఓ మసాజ్ సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మీకు మీరే సులువుగా చేసుకునే మసాజే బాడీ టాపింగ్. ప్రతి రోజూ మీ బాడీని టాప్ చేసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజు శరీరానికి టాప్ మసాజ్ చేయడం వల్ల శోషరస వ్యవస్థ, రక్త ప్రసరణ మెరుగవుతాయి. అలాగే మెల్లగా నొక్కినప్పుడు శరీర భాగాలపై ఒత్తిడి తగ్గి రిలాక్స్ అనిపిస్తుంది. దీంతో శరీరక స్థితిస్థాపకత పెరుగుతుంది. టాప్ మసాజ్ వల్ల సాధారణ ఆరోగ్యాన్ని పెంపొందించే శారీరక ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రిథమిక్ టాపింగ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియ వ్యర్థాలను తొలగించేందుకు సహాయపడుతుంది. అలాగే బిగుతుగా ఉండే కండరాలను సడలించి, కండరాల ఒత్తిడిని, నొప్పిని తగ్గిస్తుంది.
ఆ వ్యక్తులు దూరంగా ఉండటమే మంచిది
ఇతర మసాజ్‌ల మాదిరిగానే బాడీ టాపింగ్ మసాజ్ కూడా ఎండార్ఫినల్ల విడుదలను ప్రేరేపించి శరీరానికి విశ్రాంతినిస్తుంది. నరాల చివర్ల నుంచి రిలాక్స్ చేసి మస్క్యులోస్కెలెటల్ నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. రెగ్యులర్ టాప్ మసాజ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా చక్కగా సహాయపడుతుంది. ప్రతి రోజూ ట్యాప్ మసాజ్ చేసుకోవడం వల్ల మెరుగైన రక్తప్రసరణ, కండరాల సడలింపు, కండరాల నొప్పి నుంచి ఉపశమనం, ఒత్తిడి తగ్గడం వంటి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మసాజ్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వ్యక్తులు దీనికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ సేపు నిలబడటం వ్యాయామంతో సమానమా? డాక్టర్ల మాటేంటి? - Does Workout Equals To Standing