Daily Activities to Reduced Belly Fat: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. మూడు పదుల వయసులోనే.. బాణ పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. దీంతో అది తగ్గించుకునేందుకు చిన్న వయస్సులోనే మందులు వాడాల్సిన పరిస్థతి. బెల్లీ ఫ్యాట్ కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరి గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోంది. అయితే ఈ రోజువారి అలవాట్లు పాటించడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
హెల్దీ బ్రేక్‌ఫాస్ట్: బెల్లి ఫ్యాట్ తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్-రిచ్ కార్బోహైడ్రేట్‌లతో సహా సమతుల్య భోజనం, గుడ్లు, తృణధాన్యాలు కలిగిన ఓట్స్, రాగులు, పెరుగు, పండ్లు, బాదం వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోమంటున్నారు. ఈ ఆహారాలు కండరాల మరమ్మత్తు, శక్తిని అందించేందుకు.. గట్ ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అంటున్నారు.
2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తృణధాన్యాలు.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్వేలోని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ జనరల్ ప్రాక్టీస్‌లో పరిశోధకుడు డాక్టర్ డాగ్ఫిన్ ఔన్(Dagfinn Aune) పాల్గొన్నారు.
కార్డియో వ్యాయామాలు: కార్డియో వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయామాలు(హార్వర్డ్ మెడికల్ స్కూల్ రిపోర్ట్) మన శరీరానికి చాలా ముఖ్యమైనవని నిపుణులు అంటున్నారు. ఇవి కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కార్డియో వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయని.. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుందని అంటున్నారు. అలాగే హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కాబట్టి వారంలో కనీసం 150 నిమిషాలపాటు కొంచెం తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు.
మీ బాణపొట్టకు కారణం తిండి కాదు- మీరు చేసే ఈ చిన్న తప్పులేనట! - షాకింగ్ రీసెర్చ్!
వెయిట్ లిఫ్టింగ్: వెయిట్ లిఫ్టింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది మీ మెటబాలిజాన్ని పెంచుతుందని.. అలానే కేలరీలు బర్న్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. కాబట్టి.. వారానికి రెండు నుంచి మూడు సెషన్లను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, బెంచ్ ప్రెస్‌లు, ఓవర్‌హెడ్ ప్రెస్‌లు వంటివి చేయమంటున్నారు.
ఫైబర్ రిచ్ డైట్: బాదం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఫైబర్.. ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుందని.. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
తగినంత నీరు తాగాలి: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి రోజంతా తగినంత నీరు తాగటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజులో 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుందని, విషవ్యర్థాలను తొలగిస్తుందని అంటున్నారు.
ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి: మానసిక ఆరోగ్యం కూడా బెల్లీ ఫ్యాట్ పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి.. హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అందుకోసం ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి టెక్నిక్స్ ఉపయోగించి స్ట్రెస్‌ను కంట్రోల్ చేసుకోమని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ బాణపొట్ట తగ్గడానికి ఫిట్నెస్ సెంటర్లు అవసరం లే - మీ ఇంట్లోనే ఈ '5' పనులు చేయండి చాలు!
సూపర్ న్యూస్ : బరువు తగ్గాలంటే ఈ రొట్టె తినండి - కొవ్వును పిండేస్తుంది! - How to Reduce Belly Fat
మహిళలూ నలభై దాటాక పొట్ట పెరుగుతోందా? - డైలీ ఈ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది!