ETV Bharat / health

బాత్‌రూమ్‌ టైల్స్‌ మురికిగా మారాయా ? ఈ నేచురల్​ క్లీనర్స్​తో మెరుపు గ్యారంటీ! - టైల్స్‌ మెరవాలంటే ఏం చేయాలి

Easy Ways To Clean Bathroom Tiles : మీ బాత్రూమ్​ టైల్స్​ మురికిగా మారాయా..? ఎన్నిసార్లు క్లీన్​ చేసినా పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందా..? నో టెన్షన్​.. ఇంట్లో లభించే ఈ పదార్థాలతో ట్రై చేస్తే.. టైల్స్​ మెరిసిపోతాయి అంతే..!

Easy Ways To Clean Bathroom Tiles
Easy Ways To Clean Bathroom Tiles
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:43 PM IST

Easy Ways To Clean Bathroom Tiles : ఇంటిని శుభ్రం చేయడం ఒక ఎత్తయితే బాత్రూమ్​ని శుభ్రం చేయడం మరో ఎత్తు. ఎందుకంటే, ఇల్లంతా క్లీన్ చేసినా రాని అలుపు.. ఒక్క బాత్రూమ్​ కడిగితే వస్తుంది. అయితే మనలో చాలా మంది బాత్‌రూమ్‌ను ఎవరు చూస్తారులే అని ఏదో అలా కడిగి కడగనట్లుగా శుభ్రం చేస్తుంటారు. ఇక కొద్దిమంది అయితే బాత్​రూమ్​ మొత్తం క్లీన్​ చేసినా.. టైల్స్​ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. దీనివల్ల టైల్స్​పై సబ్బు నీళ్లు, దుమ్ము, ధూళి పేరుకుపోయి.. ఆ ప్లేస్​ అంతా డర్టీగా తయారవుతుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరికొద్దిమంది టైల్స్​ను క్లీన్​ చేయడానికి బయట మార్కెట్లో లభించే క్లీనర్స్​ యూజ్​ చేస్తుంటారు. ఇకపై అలా కాకుండా.. ఇంట్లో తయారు చేసిన క్లీనర్స్​తో బాత్‌రూమ్‌ టైల్స్‌ను క్లీన్​ చేస్తే.. కొత్త వాటిలా తళతళా మెరిసిపోతాయి..

బాత్‌రూమ్‌ టైల్స్‌ను ఇలా మెరిపించండి.. ఇంట్లో ఉండే వెనిగర్‌, నిమ్మరసం వంటి వాటితో బాత్‌రూమ్‌ టైల్స్‌ను మెరిపించడంతో పాటు.. వంటింట్లో ఉండే టైల్స్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగంటే..

వెనిగర్ : బాత్‌రూమ్‌ టైల్స్​పై ఉండే మురికిని తొలగించడంలో వెనిగర్‌ మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల బాత్‌రూమ్‌లో దుర్వాసన కూడా తొలగిపోతుంది. వెనిగర్‌తో టైల్స్‌ను క్లీన్‌ చేయడానికి ముందుగా ఒక కప్పులో ఐదు టేబుల్ స్పూన్ల వెనిగర్‌ను తీసుకోండి. తర్వాత అందులోకి 5 టేబుల్ స్పూన్ల నీటిని యాడ్‌ చేయండి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్‌ సహాయంతో టైల్స్‌ను తుడవండి. టైల్స్‌ ఆరిన తర్వాత అవి మెరుస్తుంటాయి.

నిమ్మరసం : నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు టైల్స్‌ను తళతళా మెరిసేలా చేస్తాయి. ఇది మంచి క్లీనర్‌గా పనిచేస్తుంది. ముందుగా ఒక స్ప్రే బాటిల్‌ను తీసుకోండి. అందులో వాటర్‌ నింపి.. రెండు లేదా మూడు నిమ్మకాయలను కట్‌ చేసి, ఆ రసాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి.. టైల్స్‌పై చల్లి, బ్రష్‌తో శుభ్రంగా క్లీన్‌ చేయండి. దీంతో అవి కొత్త వాటిలా మారతాయి.

వంట సోడా : టైల్స్‌ను శుభ్రం చేయడంలో బేకింగ్‌ సోడా కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ముందుగా ఒక టీస్పూన్‌ లిక్విడ్‌ డిష్‌ సోప్‌లో వంటసోడా, హైడ్రోజన్​ పెరాక్సైడ్​ కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి టైల్స్‌పై చల్లండి. పది నిమిషాల తర్వాత బ్రష్‌ సహాయంతో లేదా స్పాంజితో టైల్స్‌ను శుభ్రం చేయండి.

బ్లీచ్ : బ్లీచింగ్‌ పౌడర్‌ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో మనందరికీ తెలిసిందే. మీరు కూడా ఈ సారి టైల్స్‌ను శుభ్రం చేయడానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్‌ను ట్రై చేయండి. అంతే, మరకలు, దుర్వాసన అన్నీ దూరమవుతాయి. ముందుగా గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో బ్లీచ్‌ పౌడర్‌ను వేయండి. తర్వాత ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి.. టైల్స్‌పై చల్లండి. ఒక బ్రష్‌ సహాయంతో టైల్స్‌ను క్లీన్‌ చేయండి.

వాటర్ బాటిల్స్ క్లీన్​​ చేయడం కష్టంగా ఉందా? ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీ!

వాస్తు ప్రకారం మీ ఇంటిని ఇలా క్లీన్ చేయండి - దోషాలన్నీ తొలగిపోతాయ్!

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.