ETV Bharat / health

షవర్‌ తుప్పు పట్టి వాటర్‌ సరిగ్గా రావడం లేదా? - ఈ టిప్స్‌ పాటిస్తే మొత్తం క్లీన్‌ అయిపోద్ది! - Shower Cleaning Tips - SHOWER CLEANING TIPS

Bathroom Shower Cleaning Tips : ప్రస్తుతం బయట మార్కెట్లో ఎన్నో రకాల బాత్‌రూమ్‌ క్లీనర్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ, షవర్‌హెడ్‌ను క్లీన్ చేసేవి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువరోజులు షవర్‌హెడ్‌ను క్లీన్‌ చేయకుండా ఉంటే అది తుప్పు పట్టి షవర్‌ నుంచి వాటర్ తక్కువగా వస్తుంది. అయితే, కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల షవర్‌ను కొత్తదానిలా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Cleaning Tips
Bathroom Shower Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 4:49 PM IST

Bathroom Shower Cleaning Tips : ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం మహిళలు ఎంతో కష్టపడుతుంటారు. ఓపిక ఉన్నా, లేకపోయినా కూడా ఇంటిని క్లీన్‌గా ఉండేలా చూస్తారు. అలాగే రెండు, మూడు రోజులకు ఒకసారి బాత్‌రూమ్‌ను కూడా వివిధ రకాల డిటర్జెంట్‌లు, క్లీనర్‌లతో కడుగుతుంటారు. అయితే బాత్‌రూమ్‌ను తళతళ మెరిసేలా చేయడానికి ఎన్నో రకాల క్లీనర్‌లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల బాత్‌రూమ్‌లోని టైల్స్‌, ట్యాప్స్‌, సింక్‌ వంటి వాటిని కొత్తవాటిలా మెరిపించవచ్చు.

కానీ.. కొంతమందికి బాత్‌రూమ్‌లోని షవర్‌హెడ్‌ను మాత్రం శుభ్రం చేయడం రాదు. చాలా రోజులు షవర్‌హెడ్‌ను క్లీన్‌ చేయకపోతే.. అందులో నుంచి వాటర్‌ ప్రెజర్ తక్కువగా వస్తుంది. అలాగే షవర్‌హెడ్‌లో పాచి, దుమ్ము పెరుకుపోయి మనకు అలర్జీ వంటివి కూడా వస్తుంటాయి. అందుకే.. షవర్‌హెడ్‌ను క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈజీగా షవర్‌హెడ్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తుప్పు వదిలిద్దాం ఇలా..
ముందుగా షవర్‌హెడ్‌ను ఒక చిన్న బ్రష్‌ సహాయంతో క్లీన్‌ చేయండి. తర్వాత షవర్‌హెడ్‌ను బయటకు తీయండి. ఇప్పుడు ఒక మగ్‌లో లీటర్ నీళ్లు తీసుకుని.. అందులో ఒక నిమ్మకాయ పిండండి. ఇందులోకి 4 టేబుల్‌స్పూన్‌ల బేకింగ్‌ సోడా, అరకప్పు వెనిగర్‌ వేసి బాగా మిక్స్‌ చేయండి. ఇందులో మీరు కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. తర్వాత ఈ లిక్విడ్‌లో షవర్‌హెడ్‌ను ముంచండి. ఒక 20 నిమిషాల తర్వాత మీరు షవర్‌ హెడ్‌ను క్లీన్‌ చేస్తే.. కొత్తదానిలా మెరిసిపోతుంది. ఇలా చేయడం వల్ల షవర్‌హెడ్‌ రంధ్రాలలోని తుప్పు మొత్తం బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది!

ఒకవేళ షవర్‌హెడ్‌ బయటకు తీయరాకపోతే ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో వాటర్ పోసి.. రాత్రి షవర్‌హెడ్‌కు కట్టండి. ఇలా ఉదయం వరకు అలాగే వాటర్‌ను ఉంచడం వల్ల తుప్పు మొత్తం తొలగిపోతుంది. తర్వాత ఎక్కువ ప్రెజర్‌తో వాటర్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టైల్స్ ఇలా మెరిసేలా చేద్దాం :
చాలా మంది బాత్‌రూమ్‌ను క్లీన్ చేస్తారు కానీ, టైల్స్‌ను మాత్రం అస్సలు శుభ్రం చేయరు. దీంతో టైల్స్‌ చాలా మురికిగా మారిపోతాయి. అయితే, వీటి మురికిని తొలగించడానికి ఒక మగ్‌లో బేకింగ్‌ సోడా కొద్దిగా వేసి వాటర్‌ యాడ్‌ చేయండి. ఇప్పుడు మురికిగా ఉన్న టైల్స్‌పై బేకింగ్‌ సోడా మిశ్రమాన్ని పోసి స్క్రబ్‌ చేయండి. ఇలా చేస్తే ఎంత మురికిగా ఉన్న టైల్స్‌ అయినా కూడా కొత్తవాటిలా మెరిసిపోవడం ఖాయం!

సబ్బు మరకలను మాయం చేయండి :
కొన్నిసార్లు బాత్ రూమ్​లో సోప్‌ పెట్టిన చోట సబ్బు మరకలు అట్టుకట్టిపోతాయి. దీంతో అక్కడ అంతా చాలా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు బ్యాడ్‌స్మెల్‌ కూడా వస్తుంది. ఈ మరకలు తొలగించడానికి వెనిగర్, డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను సమాన భాగాలుగా తీసుకొని మిశ్రమాన్ని రెడీ చేయాలి. ఇప్పుడు ఈ లిక్విడ్‌లో స్పాంజ్ ముంచి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో.. అక్కడ శుభ్రం చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచి.. స్మూత్​గా స్క్రబ్ చేసి, వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. అంతే ఇలా ఈజీగా సబ్బు మరకలను మాయం చేసుకోవచ్చు.

బాత్‌రూమ్‌ టైల్స్‌ మురికిగా మారాయా ? ఈ నేచురల్​ క్లీనర్స్​తో మెరుపు గ్యారంటీ!

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.