Ayurvedic Treatment for Dry Cough: చలికాలంలో చాలా మందిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. ముఖ్యంగా కొన్నిసార్లు విపరీతమైన పొడి దగ్గు సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ పొడి దగ్గు వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సివస్తుంది. అయితే ఇలాంటి వారికోసం ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. కేవలం మన ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఈజీగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 40 గ్రాముల తాలీసపత్రీ చూర్ణం
- 10 గ్రాముల శొంఠి చూర్ణం
- 10 గ్రాముల పిప్పళ్ల చూర్ణం
- 10 గ్రాముల మిరియాల చూర్ణం
- 10 గ్రాముల వెదురు ఉప్పు చూర్ణం
- 10 గ్రాముల యాలకుల చూర్ణం
- 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణం
- 100 గ్రాముల పటిక బెల్లం చూర్ణం
తయారీ విధానం: ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో తాలీసపత్రీ చూర్ణం, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, వెదురు ఉప్పు, యాలకులు, దాల్చిన చెక్క, పటిక బెల్లం చూర్ణం వేసి బాగా కలపాలి.
ఎలా తీసుకోవాలి?: ఈ ఔషధాన్ని పొడి దగ్గు సమస్యతో బాధపడేవారు మూడు పూటలా చిన్న చెంచా చూర్ణాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిని చెంచా చూర్ణాన్ని తీసుకుని నాలుకతో అద్దుకుంటూ తీసుకోవాలని అంటున్నారు. నేరుగా మింగేయకూడదని, అలానే నీటిలో కూడా కలిపి తీసుకోకూడదని వివరిస్తున్నారు.
తాలీసపత్రీ: పొడి దగ్గు సమస్యను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు.
శొంఠి: చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
మిరియాల పొడి: కఫాన్ని తొలగించడంలో మిరియాలు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇంకా ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
పటిక బెల్లం: పటిక బెల్లం మంచి యాంటీ సెఫ్టిక్గా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దగ్గు తగ్గడంలో సహాయ పడుతుందని వివరిస్తున్నారు.
పిప్పళ్లు: మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతుంటారు. పొడి దగ్గు సమస్యను తగ్గిచండంలోనూ పిప్పళ్లు ఉపయోగపడతాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పారాసిటమాల్ వేస్తున్నారా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!
ఈ మాడు సూత్రాలు పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారట! హెల్దీ లైఫ్ టిప్స్ మీకు తెలుసా?