ETV Bharat / health

ఏ షాంపూ వాడినా డాండ్రఫ్ పోవట్లేదా? ఇది వాడితే తగ్గిపోతుందట! - AYURVEDA TREATMENT FOR DANDRUFF

-చుండ్రు సమస్యకు ఆయుర్వేద పద్ధతిలో ఔషధం -ఇంట్లోని పదార్థాలతోనే ఈజీగా చేసుకోవచ్చు!

Ayurvedic Medicine Preparation For Dandruf
Ayurvedic Medicine Preparation For Dandruf (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 1, 2024, 4:08 PM IST

Ayurvedic Medicine Preparation For Dandruff: చుండ్రు సమస్య ఎక్కువగా బాధించేది కాకపోయినా.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని పాడుచేస్తుంది. మీరు కూడా ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? అనేక షాంపూలు వాడినా ప్రయోజనం లేదా? ఈ సమస్యకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గం ఉందని ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

  • పావు లీటర్ కొబ్బరి నూనె
  • 50 గ్రాముల కరక్కాయ చూర్ణం
  • 50 గ్రాముల ఉసిరికాయ పొడి
  • 50 గ్రాముల వేపాకు పొడి
  • 50 గ్రాముల యష్టిమధు చూర్ణం
  • 50 గ్రాముల పారిజాతం గింజల చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించి ఓ గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
  • ఇందులోనే కొబ్బరి నూనె, ఉసిరి పొడి, వేపాకు పొడి, కరక్కాయ, యష్టి మధు, పారిజాతం గింజల చూర్ణం వేసుకుని కలపాలి.
  • ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్​పై నెమ్మదిగా నీళ్లు ఆవిరయ్యే వరకు మరిగించుకోవాలి.
  • నీరు ఆవిరి అయ్యాక స్టౌ ఆఫ్ చేసి వడపోసుకుంటే చుండ్రు సమస్యను తగ్గించే ఔషదం రెడీ!
  • చుండ్రు సమస్యతో బాధపడేవారు తల స్నానం చేసే ముందు రోజు లేదా ఆ రోజు రెండు గంటల ముందు పెట్టుకుని స్నానం చేయాలని సూచిస్తున్నారు.

ఉసిరికాయ: ఉసిరికాయ వెంట్రుకలను చక్కగా, మృదువుగా ఉండేలా చేస్తుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు గాయత్రీ దేవీ చెబుతున్నారు. వెంట్రుకలకు మంచి టానిక్​లాగా ఉపయోగపడుతుందని వివరించారు.

కరక్కాయ చూర్ణం: మనకు చుండ్రు వచ్చిన సమయంలో జుట్టు జిడ్డుగా, చికాకుగా ఉంటుంది. ఇలాంటి సమస్యను తగ్గించడానికి కరక్కాయ చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు.

వేపాకు పొడి: వేపాకులోని చేదు గుణం చుండ్రను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. వెంట్రుకలు జిడ్డుగా ఉండే సమస్యను అరికడుతుందని వివరించారు.

యష్టిమధు చూర్ణం: ఇది మంచి హెయిర్ టానిక్​లాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే జుట్టు పెరగడానికి కూడా చక్కగా సహాయపడుతుందని వివరించారు.

పారిజాతం గింజలు: చుండ్రు సమస్యను తగ్గించడానికి పారిజాతం గింజలు చక్కలు బాగా ఉపయోగపడతాయని గాయత్రీ దేవీ చెబుతున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్ర లేవగానే ఇలా చేస్తున్నారా? మీకు ఈ వ్యాధులు వచ్చే ఛాన్స్ జాగ్రత్త!

షుగర్ పేషెంట్స్ రోజు ఎంత నీరు తాగితే మంచిది? తలనొప్పికి వాటర్​తో చెక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.