ETV Bharat / health

వర్షాకాలంలో సైనసైటిస్​ అవస్థలా? - మీ కోసం ఆయుర్వేద నిపుణుల చిట్కాలు! - Sinus Remedy Ayurveda

Ayurveda Treatment for Sinusitis : సైనసైటిస్ ఉన్నవారు నిత్యం నరకం చూస్తుంటారు. వాతావరణం మారిందంటే చాలు.. ముక్కులు పట్టేస్తాయి. ఊపిరి పీల్చడం ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో తీవ్రమైన తలనొప్పి కూడా వేధిస్తుంది. అయితే.. ఈ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Sinusitis
Ayurveda Treatment for Sinusitis (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 10:08 AM IST

Updated : Sep 14, 2024, 9:58 AM IST

Sinusitis Tips In Ayurveda : ముఖంలో కళ్ల దగ్గర ముక్కు పక్క భాగాల్లోని ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్​ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్​ సోకి వాచిపోవడాన్నే.. "సైనసైటిస్‌"​గా పిలుస్తారు. అయితే.. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఈ ఆరోగ్య సమస్య తలెత్త వచ్చని నిపుణులు చెబుతున్నారు. సైనసైటిస్​ వచ్చినవారు నిరంతర జలుబు, శ్వాస ఆడకపోవడం, నిత్యం తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.

ఇంకా.. తల మొత్తం బరువుగా ఉంటుంది. ముఖం మొత్తం వాపు వస్తుంది. కనుబొమ్మలు జివ్వుమని లాగడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సైనసైటిస్​ సమస్య నిత్య జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతగా వేధించే ఈ సైనసైటిస్​ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఆచార్యులు డాక్టర్​ పి.వి. రంగనాయకులు. ఆ వివరాలు మీ కోసం..

సైనసైటిస్‌ సమస్య కొంతమందిలో నెలరోజుల్లో తగ్గిపోతే.. మరికొంతమందిలో ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు కనిపించే అవకాశం ఉంది. సైనస్​ సమస్య తీవ్రంగా వేధించినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా రకాల మార్పులు చేసుకోవాలి.

  • స్మోకింగ్​ పూర్తిగా మానేయాలి.
  • ముఖ్యంగా సైనస్​ బాధల్ని పెంచే అలర్జీ కారకాలైన దుమ్ము ధూళి, కాలుష్యం ఉన్న చోట నుంచి దూరంగా ఉండాలి.
  • నోటిని తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ఉదయం, సాయంత్రం వేడి నీటి ఆవిరి పట్టుకోవాలి. నీటిలో యూకలిప్టస్​ ఆయిల్​ కొన్ని చుక్కలు వేసుకుంటే మంచిది.
  • చల్ల గాలికి తిరగకూడదు.
  • అలాగే ఫ్రిడ్జ్​లో కూల్​గా ఉండే డ్రింక్స్​, పుల్లటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • రోజూ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • రాత్రి బాగా నిద్రపోవాలి.
  • చలికాలంలో చెవులకు రక్షణ కల్పించాలి.
  • గోరు వెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు, కనుబొమ్మల మధ్య భాగంలో మృదువుగా మసాజ్​ చేసుకోవాలి. ఇలా చేస్తే సైనసైటిస్‌ బాధలు తగ్గుముఖం పడతయాని డాక్టర్ పి.వి రంగనాయకులు చెబుతున్నారు.

"సైనసైటిస్‌​ సమస్య ఉన్న వారు ఫ్యాన్​ కింద నేరుగా పడుకోకూడదు. దీనివల్ల సమస్య తీవ్రమవుతుంది. బయట ఆయుర్వేద షాపుల్లో అణు తైలం, షడ్​ బింధు తైలం అని రెండు రకాలు దొరుకుతాయి. ఈ రెండు తైలాలో ఏదోఒకటి తీసుకుని రెండు చుక్కలను అప్పుడప్పుడూ ముక్కులో వేసుకోవాలి. దీనివల్ల సైనస్​ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగాలి."- డాక్టర్ పి.వి రంగనాయకులు

చిత్రకహరీతకి అనే ఔషధం ఆయుర్వేద షాపుల్లో లభ్యమవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా సమస్య తగ్గుముఖం పడుతుందని డాక్టర్ పి.వి రంగనాయకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సైనస్​ ఇబ్బంది పెడుతోందా? ఈ ఆసనాలతో ఫుల్ రిలీఫ్​!

సైనస్​తో బాధ పడుతున్నారా?.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి రిజల్ట్స్​ పక్కా​!

Last Updated : Sep 14, 2024, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.