Health Benefits of Avocado : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చాలా మంది శరీరానికి తగిన పోషకాలు అందాలని డైలీ వివిధ రకాల పండ్లు తీసుకుంటుంటారు. అయితే అందులో అవకాడో ఉంటుంది. అయితే చాలా మంది దీనిని ఎప్పుడో ఒకసారి తింటుంటారు. అలాకాకుండా ప్రతిరోజు అవకాడోను తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అవకాడో పోషకాలు: అవకాడోను బట్టర్ ప్రూట్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, పొటాషియం, విటమిన్ A, విటమిన్ సి, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్, ఫోలేట్ వంటివి చాలానే ఉన్నాయి. కాబట్టి దీనిని రెగ్యులర్‌గా తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అవేంటంటే..
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు డైలీ అవకాడోలను తీసుకోవడం ద్వారా కంటి చూపు బాగుంటుంది. ఇందులో పుష్కలంగా ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఐ హెల్త్‌కి ఎంతో బాగా సహాయపడతాయి. అదే విధంగా అవకాడోలో ఉంటే న్యూట్రియెంట్స్ మంచి ఐ సైట్‌ని మెయింటెయిన్ చేయడంతో పాటు నైట్ టైమ్ కళ్లు స్పష్టంగా కనిపించేటట్లు చేస్తాయి. ముఖ్యంగా UV కిరణాల వల్ల కంటికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ల వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.
వెయిట్ లాస్ : బరువు తగ్గాలనుకునే వారు తమ డైలీ డైట్లో అవకాడోను చేర్చుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా త్వరగా ఆకలివేయదు. ఇందులో కార్బ్స్ కూడా తక్కువగానే ఉంటాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది : అవోకాడోలో ఫోలేట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లను ప్రోత్సహించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఫోలేట్ కంటెంట్ తక్కువగా ఉన్నవారు డిప్రెషన్‌కు లోనవుతారు. కాబట్టి దీనిని డైలీ తీసుకోవడం ద్వారా ఆ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చంటున్నారు. ఈ పండు పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అందుకే ప్రెగ్నెంట్స్ ఈ ఫ్రూట్‌ని వారి డైలీ డైట్లో భాగం చేసుకుంటే బిడ్డ ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!
బ్లడ్ ప్రెజర్‌ని రెగ్యులేట్ చేస్తుంది : అవకాడో బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ ఉండడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే బీపీ అదుపులో ఉంటుందో అప్పుడు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.
ఎనర్జీ బూస్టింగ్ : అవకాడోలో థయామిన్ (B1), రిబోఫ్లావిన్ (B2), నియాసిన్ (B3)తో సహా అనేక రకాల ఇతర B విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి. అదేవిధంగా అవకాడోలో ఉండే మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి : అవకాడోలో విటమిన్ E ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అవకాడోలు తీసుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి రాకుండా రక్షించుకోవచ్చు. అదే విధంగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : డైజెషన్ సరిగా లేని వాళ్లు అవకాడోను డైట్లో చేర్చుకోవడం ద్వారా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్స్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను, కొలోన్ హెల్త్నీ ఇంప్రూవ్ చేస్తాయంటున్నారు నిపుణులు.
Vitamin C Foods : విటమిన్ 'సి' లోపమా? ఇవి తినేయండి.. అంతా సెట్!
ఈ పండ్లను కలిపి తింటే యమ డేంజర్.. అస్సలు తినకూడని కాంబినేషన్లు ఇవే!