How To Lose Arm Fat In Telugu : చేతుల చుట్టూ పేరుకుపోయిన కండలను కరిగించేదుకు కొన్ని వర్కవుట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం.. 5 నుంచి 15 కేజీల మధ్య మీరు ఎత్తగలిగే డంబెల్స్ తీసుకోండి. ఇప్పుడు వెన్నుని నిటారుగా ఉంచి, మోకాళ్లను మాత్రం కాస్త వంచి వాటిని నెమ్మదిగా భుజం వరకూ తీసుకురావాలి. ఆపై చేతి కండరాల్ని గట్టిగా హోల్డ్ చేయాలి. రెండు నిమిషాలు ఆగి నెమ్మదిగా వదులుతూ యథాస్థానానికి చేతిని తీసుకురావాలి. ఇలా రోజూ ఐదారుసార్లు చేస్తే సరి. ఆర్మ్ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందంటున్నారు నిపుణులు.
2018లో "జర్నల్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ రీసెర్చ్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బైసప్ కర్ల్స్ అనే వ్యాయామం చేసిన వ్యక్తులలో.. చేతి చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడాన్ని గమనించారట. ఈ పరిశోధనలో యూఎస్‌లోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ బ్రెండన్ కె. డోనహ్యూ పాల్గొన్నారు. ఆర్మ్ ఫ్యాట్‌ను తగ్గించడంలో బైసప్ కర్ల్స్ వర్కౌట్ చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
చెస్ట్ ప్రెస్ : ఈ వర్కౌట్ కూడా ఆర్మ్ ఫ్యాట్‌ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా మోకాళ్లని నిటారుగా ఉంచి బెంచ్‌పై బారుగా పడుకోవాలి. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ బార్‌ను చేతులతో భుజాలకు కొంచెం దూరంలో ఉండేలా పట్టుకొని.. మీ ఛాతీ నుంచి హ్యాండ్స్ పూర్తిగా విస్తరించే వరకు నేరుగా పైకి నెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ నార్మల్ పొజిషన్‌కు తీసుకురావాలి. అలా మీకు వీలైనన్ని సెట్లు చేయాలి. రోజు రోజుకూ పెంచుకుంటూ వెళ్లాలి. ఫలితంగా కొద్ది రోజుల్లోనే చేతుల దగ్గర కొవ్వు కరిగి నాజూగ్గా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?
ట్రైసప్ ప్రెస్ : ఇందుకోసం ముందుగా మీ పాదాలను భుజం వెడల్పులో ఉంచి, వెన్నుని నిటారుగా పెట్టి నిలబడాలి. రెండు చేతులతో డంబెల్స్ పట్టుకోండి. ఆపై చేతుల్ని వదులుగా చేసి రెండు చేతులతో వెయిట్స్‌ని తలవెనక్కి తీసుకెళ్లాలి. ఇప్పుడు చేతి కండరాల్ని బిగించి, నెమ్మదిగా వదలాలి. ఇలా పది సార్లు చేస్తే సరి. కొవ్వు కరిగి చేతులు నాజూగ్గా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
పుషప్స్ : మీరు ఆర్మ్ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలా? అయితే, పుషప్స్ స్టార్ట్ చేయండి. రెగ్యులర్ వీటిని చేయడం వల్ల చేతులు, భుజాల్లోని కండరాలు బలపడుతాయంటున్నారు నిపుణులు. తద్వారా ఆర్మ్ ఫ్యాట్‌తో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని సూచిస్తున్నారు.
బెంచ్ డిప్ : ఇది ఆర్మ్ ఫ్యాట్‌ని తగ్గించడంలో బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇంట్లోని సోఫా, కుర్చీ ఎంచుకొని దాని అంచుని పట్టుకుని హ్యాండ్స్పై ఒత్తిడి పెంచి తుంటిని ముందుకు వెనక్కి కదలించాలి. తద్వారా చేతి కండరాలకు మంచి వ్యాయామం లభించి ఫ్యాట్ కరుగుతుందంటున్నారు నిపుణులు.
క్యాట్ కౌ పోజ్ : ఈ యోగా ఆసనం వేయడం వల్ల కూడా ఆర్మ్ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ ఆసనంలో భాగంగా వెనక్కి రెండు చేతులు, కాళ్లని మడిచిపెట్టి వ్యాయామం చేసినప్పుడు చేయి, భుజ కండరాలు స్ట్రాంగ్‌గా మారుతాయి. దాంతోపాటు చేతి దగ్గర కొవ్వు కూడా కరుగుతుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వ్యాయామం కొన్ని రోజులు చేసి మీకు తెలియకుండానే ఆపేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే ఎప్పటికీ ఆగిపోరు!