ETV Bharat / health

మీకు నచ్చినట్టు, వచ్చినట్టు డ్యాన్స్​ వేయండి - ఈ హెల్త్​ బెనిఫిట్స్​ పొందండి! - Amazing Health Benefits of Dance - AMAZING HEALTH BENEFITS OF DANCE

Health Benefits of Dance: డ్యాన్స్ అనేది ఓ కళ. ఇది అందరికీ రాదు. కానీ, ప్రతి ఒక్కరికీ వారి సొంత స్టైల్ ఉంటుంది. కొందరు పాటకు తగ్గట్టు డ్యాన్స్​ చేస్తే.. మరికొందరు మాత్రం తమకు నచ్చినట్టు వేస్తారు. ఎలా వేసినా డ్యాన్స్​తో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్నో ప్రయోజనాలు డ్యాన్స్​ చేస్తే లభిస్తాయంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 5:18 PM IST

Amazing Health Benefits of Dance: ప్రస్తుత రోజుల్లో స్కూల్లో ఫంక్షన్‌, కాలేజ్‌లో పార్టీ, పెళ్లిలో బరాత్‌, ఇంట్లో చిన్న గెట్‌ టూ గెదర్‌, దేవుడి ఊరేగింపులు... ఇలా హ్యాపీ అకేషన్​ ఏదైనా డ్యాన్స్‌ కంపల్సరీగా ఉండాల్సిందే. సౌండ్‌ బాక్సులు బద్దలయ్యేలా పాటలు పెట్టుకుని స్టెప్పులు వేస్తేనే ఆ కిక్‌ వస్తుంది. వయసు, జెండర్​తో సంబంధం లేకుండా చిందులేస్తేనేగాని ఆ ఫీల్‌ ఉండదు. అయితే డ్యాన్స్‌ వేస్తే కేవలం మనసుకు ఆనందమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..

శారీరక ప్రయోజనాలు:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: డ్యాన్స్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం అని.. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక గంట డ్యాన్స్ చేయడం వల్ల 400 నుంచి 600 కేలరీలు బర్న్​ అవుతాయని అంటున్నారు. అయితే ఇది ఆ వ్యక్తి బరువు, డ్యాన్స్ ఇన్‌టెన్సిటీ, డ్యాన్స్‌ ఫామ్‌ బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కేలరీలు ఎక్కువగా ఖర్చయితే.. త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: రోజూ కొంత సమయం డ్యాన్స్‌ చేస్తే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజూ డ్యాన్స్ చేస్తే హార్ట్‌ బీట్‌ స్థిరంగా ఉంటుందని.. గుండె సమస్యలను నివారిస్తుందని తెలుపుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. వాకింగ్‌, ఎక్సర్‌సైజ్‌ చేసే వారికంటే డ్యాన్స్ చేసే వారికి గుండె ఆరోగ్యం, శ్వాస తీసుకోవడం మెరుగుపడిందని పేర్కొన్నారు. వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట కంటే ఎక్కువ సేపు డ్యాన్స్ చేసే వ్యక్తుల స్టామినా, శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని అంటున్నారు. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

2001లో "ది ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్" జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. డ్యాన్స్​ చేయడం వల్ల గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, రక్తపోటు గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్త్​ కరోలినాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో కార్డియోవాస్కులర్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డా. కార్డిన్ అ. బట్లర్ పాల్గొన్నారు.

ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? అయితే మీకు బ్రెయిన్​ స్ట్రోక్ ముప్పు పొంచి ఉన్నట్లే!​ - Lifestyle Mistakes to Brain Stroke

కండరాలు బలంగా, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: డ్యాన్స్ అనేది మొత్తం శరీరానికి వ్యాయామం అని.. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు. డ్యాన్స్ ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

మానసిక ప్రయోజనాలు:

ఒత్తిడిని తగ్గిస్తుంది: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారు. అయితే డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించడానికి, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించడానికి ఒక గొప్ప మార్గమని నిపుణులు అంటున్నారు. ఇది విశ్రాంతిని ప్రోత్సహించే ఎండార్ఫిన్ల విడుదలను కూడా ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. డ్యాన్స్ డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్లోస్ వన్​ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం డ్యాన్స్ ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సమర్థవంతమైనదని కనుగొన్నారు.

ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది: డ్యాన్స్ మెదడును ఉత్తేజితం చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. 2014లో జర్నల్ ఆఫ్ ఆల్జైమర్స్ డిసీజ్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం డ్యాన్స్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో డల్లాస్​లోని టెక్సాస్​ విశ్వవిద్యాలయంలోని న్యూరోసైన్స్ ప్రొఫెసర్ డా. జాన్ A కోల్‌మన్ పాల్గొన్నారు.​

సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది: డ్యాన్స్ క్లాసులు లేదా సామాజిక నృత్యాలలో పాల్గొనడం వల్ల కొత్త వ్యక్తులను కలవడానికి, స్నేహితులను సంపాదించడానికి ఒక గొప్ప మార్గం. ఇది మీ సామాజిక నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

బార్లీ వాటర్​ - ఎండ నుంచి రక్ష మాత్రమే కాదు - ఈ సమస్యలకు కూడా దివ్యౌషధం! - Barley Water Benefits in Summer

మంచిదికదా అని సమ్మర్‌లో పుచ్చకాయను ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! - side effects of eating watermelon

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.