Amla Benefits For Hair : ఉసిరికాయ తింటే ఇమ్యూనిటీనే కాదు కేశారోగ్యం కూడా మెరుగుపడుతుందట. ఆయుర్వేద ప్రకారం జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి ఉసిరి దివ్యౌషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు తెల్లపడకుండా, డాండ్రఫ్ దరి చేరకుండా కాపాడుతుందట ఉసిరి. అంతేకాకుండా జుట్టుకు నేచురల్ కండిషనర్‌గా కూడా పని చేసి స్మూత్‌గా, సిల్కీగా మారుస్తుంది.
ఉసిరి జ్యూస్
ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాని నుంచి ఉసిరి రసం పిండాలి. దానిని వడకట్టి కేవలం ఉసిరి రసాన్ని ఫిల్టర్ చేసి, కాస్త నీరు కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా రోజూ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలపడి జుట్టు త్వరగా ఎదుగుతుంది.
ఉసిరి నూనె
జుట్టు ఎదగడానికి, కేశాల నాణ్యతను పెంచడానికి పురాతన ఆచారమే ఈ ఉసిరి నూనె. విటమిన్ సీతో పాటు పోషకాలు, ఎమినో యాసిడ్లు, ఫైటోన్యూట్రియంట్లు జుట్టును బలంగా మారుస్తాయి. ఇతర ట్రీట్మెంట్లు అవసరం లేనంతగా జుట్టుకు పర్పెక్ట్‌గా పనిచేస్తుంది. రోజూ దీనిని తలకు పట్టించడం వల్ల స్మూత్, స్ట్రాంగ్, షైనీ జుట్టు మీ సొంతం అవుతుంది.
ఉసిరి-రీతా-శికాకాయ్ (షాంపూ)
ఉసిరిలో ఉండే ఉన్నత పోషకాలతో పాటు శికాకాయ, కుంకుడుకాయలతో కలిపి తీసుకుంటే మరింత బెనిఫిషియల్ అవుతుంది. మీకున్న జుట్టు సమస్యలను మొత్తం పోగొడతాయి కూడా. ఉసిరి మీ జుట్టుకు విటమిన్ సీ, కాల్షియం, ఐరన్, పాస్పరస్, విటమిన్ బీ, ప్రొటీన్, ఫైబర్, కెరోటిన్ అందిస్తుంది. అదే సమయంలో కుంకుడు కాయ వెంట్రుకులను సహజంగా శుభ్రం చేసి దృఢమైన కేశాలను అందిస్తుంది. పురాతన పద్ధతుల ప్రకారం, వెంట్రుకలు రాలిపోవడం, డాండ్రఫ్ రాకుండా చూసుకుని ప్రకాశవంతంగా మారుస్తుంది. కుంకుడుకాయలు, శికాకాయ, ఉసిరి కాయ కొంచెం చొప్పున తీసుకుని రాత్రంతా ఉడకబెట్టి మెత్తగా నూరాలి. ఆ తర్వాత అందులో గుజ్జును తీసేసి జుట్టుకు అప్లై చేసుకోవడమే.
ఉసిరి - నిమ్మ ఫేస్ మాస్క్
జీవం లేని జుట్టును కాంతివంతంగా మార్చే గుణం నిమ్మకాయల్లో ఉంటుంది. కేశాలను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మకాయల్లో, ఉసిరిలో ఉండే విటమిన్ సీ స్థాయిలు అధికంగా ఉండి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఉసిరి, నిమ్మకాయ కలిపి వాడటం వల్ల జుట్టుకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా డాండ్రఫ్, యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా కుదుళ్లలో దురద రానివ్వకుండా జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
ఉసిరి - యోగర్ట్
ఉసిరితో పాటు యోగర్ట్ జుట్టు ఎదిగేందుకు తోడ్పడేవే. యోగర్ట్ పాడైపోయిన (చిట్లిపోయిన) వెంట్రుకలను రిపైర్ చేసి, పొడి జుట్టును తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. యోగర్ట్‌తో పాటు ఉసిరి కాయ రసం జుట్టుకు పట్టించడం వల్ల ఈ బెనిఫిట్స్ పొందొచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
Hair Growth Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా?.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు!