Yuvaraj Singh Biopic Official Announcement : ఒక్క ఓవర్ - ఆరు సిక్స్‌లు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. భారతీయ క్రికెట్ చరిత్రలో అతడతు ఓ సంచలనం. అలాగే వ్యక్తిగతంగాను ఎంతోమందికి ఆదర్శం. అయితే ఈ వీరుడి జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో క్రీడాభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ యువీ బయోపిక్‌ను నిర్మించనుంది. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే హీరో ఎవరు, దర్శకుడు ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ప్రభాస్ 'సాహో', 'స్పిరిట్'(ఇంకా షూట్ మొదలవ్వలేదు), అజయ్ దేవగన్ 'తానాజీ', షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్', రణబీర్ కపూర్ 'యానిమల్' సహా పలు చిత్రాలను టీ సిరీస్ నిర్మించింది. అందుకే ఇప్పుడా ఆ బ్యానర్లో యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కునుండట వల్ల అటు క్రికెట్ ప్రేమికుల్లో, ఇటు సినిమా లవర్స్‌లో అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.
ఇక నిర్మాత రవిభాగ్ విషయానికొస్తే ఆయన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' డాక్యుమెంటరీ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మరొ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితాన్ని తెరపైకి తీసుకురావడంలో కృషి చేయడం విశేషం.
ఆయన జీవితం పోరాటం - 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఎంపికైన యువరాజ్ ఆ తర్వాత 2000లో అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ముద్దాడాడు. అనంతరం టీమ్ ఇండియాకు ఎంపికై 2007 టీ 20 వరల్డ్ కప్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇక అతడి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి కూడా. 2011లో ఆయన క్యాన్సర్ బారిన పడ్డాడు. అయినా అధైర్య పడకుండా పోరాటం చేసి క్యాన్సర్‌ను జయించాడు. ఎంతోమందిలో మనోధైర్యాన్ని నింపాడు. ఆ తర్వాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టాడు.
గంభీర్ రిజెక్ట్ చేసిన దిగ్గజ ఆటగాడికి లఖ్‌నవూ బంపరాఫర్! - Lucknow Super Giants