ETV Bharat / entertainment

యశ సరసన ఇద్దరు భామలు - ఆమె మాత్రం పక్కా 'టాక్సిక్​' - Yash Toxic Movie - YASH TOXIC MOVIE

Yash Toxic Movie : పాన్ఇండియా మూవీ 'టాక్సిక్​'లో యశ్​ సరసన ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇంతకీ వారెవరంటే?

Yash Toxic Movie Heroine
Yash (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 7:05 AM IST

Yash Toxic Movie : శాండల్​వుడ్ స్టార్ హీరో యశ్‌, 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ కాంబినేషన్‌లో రానున్న పాన్‌ ఇండియా మూవీ 'టాక్సిక్‌'. యశ్​ బర్త్​డే సందర్భంగా విడుదలైన టైటిల్ రివీల్​ వీడియోతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయంపై రోజుకో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ మూవీలో తొలుత బెబో కరీనా కపూర్ యశ్​కు జోడీగా నటిస్తారని అన్నారు. కానీ ఆ తర్వాత ఆ రూమర్స్​లో ఏమాత్రం నిజం లేదని స్వయంగా హీరోయినే క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడేమో యశ్‌ సరసన బాలీవుడ్​ బ్యూటీ కియారా అడ్వాణీ పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని సెకెండ్​ లీడ్ కోసం మరో బీటౌన్​ బ్యూటీని మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 'స్టూడెంట్​ ఆఫ్​ ద ఇయర్-2' హీరోయిన్ తారా సుతారియాను సెకెండ్ సీడ్​గా ఫిక్స్​ చేసినట్లు సినీ వర్గాల టాక్. ఇప్పటికే ఈ విషయం గురించి తారాతోనూ సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

మరోవైపు యశ్ సోదరి పాత్రలో కోలీవుడ్ లేడీ సూపర్​స్టార్​ నయనతార నటించనుండగా, ఆమెతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ నటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో నటించేవారి లిస్ట్​ పవర్​ఫుల్​గా ఉండనున్నట్లు సమాచారం

ఇక టాక్సిక్ విషయానికి వస్తే, 1950 - 1970 మధ్య కాలంలో జరిగే డ్రగ్‌ మాఫియా బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం. ఇందులో యశ్‌ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట. అందుకోసమే తాజాగా తన కొత్త లుక్​తో అభిమానులను సర్​ప్రైజ్ చేశారు. పూర్తి రగ్గ్​డ్​గా కనిపించి ఆకట్టుకున్నారు.

కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. సెప్టెంబరు నుంచి మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్​లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

అనంత్-రాధిక వెడ్డింగ్​లో హీరో యశ్​ కొత్త లుక్​ - సోషల్ మీడియా షేక్​! - KGF Yash Stylish Look

'రాజధాని రౌడీ'గా రానున్న హీరో యశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.