ETV Bharat / entertainment

యానిమల్ బ్యూటీకి 'బాయ్​కాట్' సెగ- మేనేజ్​మెంట్​ ఏమందంటే? - Womens Allegations on Tripti Dimri - WOMENS ALLEGATIONS ON TRIPTI DIMRI

Womens Allegations on Tripti Dimri : బాలీవుడ్‌ నటి త్రిప్తి డిమ్రి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వస్తోన్న వార్తలపై ఆమె టీమ్‌ స్పందించింది. తన సినిమాలను బాయ్​కాట్ చేస్తామంటూ మహిళలు ఆందోళన చేయగా, వారి కోసం తన టీమ్​ ఓ స్టేట్​మెంట్​ను కూడా విడుదల చేసింది. ఇంతకీ ఏమైందంటే?

Tripti Dimri
Tripti Dimri (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 3:03 PM IST

Womens Allegations on Tripti Dimri : 'యానిమల్‌' బ్యూటీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై తన టీమ్​ స్పందించి, ఓ స్టేట్‌మెంట్‌ కూడా రిలీజ్‌ చేసింది.

"తన అప్​కమింగ్ మూవీ 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' ప్రమోషన్స్‌లో త్రిప్తి డిమ్రి చాలా యాక్టివ్​గా పాల్గొంటున్నారు. తనకున్న బిజీ షెడ్యూల్స్ ప్రకారం ఆమె అటు ఈవెంట్స్​తో పాటు ఇటు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన ప్రొఫషనల్ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆమె పాల్లోవట్లేదు. ఇటువంటి వాటికి సంబంధించి డబ్బులు తీసుకోవడం లేదా అదనంగా వసూలు చేయడం కూడా చేయలేదు" అని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ఏమైందంటే?
'ఎఫ్‌ఐసీసీఐ ఎఫ్‌ఎల్‌ఓ'లోని పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు జైపుర్‌ వేదికగా నిర్వహించిన ప్రోగ్రామ్​కు హాజరుకావాలంటూ ఇటీవల త్రిప్తి డిమ్రికి రూ.5 లక్షలు నగదును అందజేశారని సమాచారం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిప్తి ఆ ఈవెంట్‌కు హాజరుకాలేక పోయింది. అయితే ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, ఆ తీరును తప్పుబడటం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆమె సినిమాలు బాయ్‌కాట్‌ చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో పాటు ఈవెంట్‌లో ఆమె కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లను సైతం ధ్వంసం చేయడానికి యత్నించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవ్వగా, దానికి ఈ విధంగా ఆమె టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

'నా ఫ్రీడమ్​ కూడా పోయింది'
యానిమల్‌ రిలీజ్​కు ముందు తాను కూరగాయలు కొనడానికి బయటకు వెళ్లేదానని అలాగే బిజీగా మారే రోజు కోసం ఎదురుచూశానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తి చెప్పుకొచ్చారు. అయితే యానిమల్ తర్వాత గుర్తింపుతో పాటు నేను స్వేచ్ఛను కోల్పోయానంటూ చెప్పుకొచ్చింది.

"నాకు ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఎంజాయ్‌ చేయడం అంటే ఇష్టం. వాళ్లతో ఉంటే నాకు వేరే ఆలోచనలే రావు. కానీ 'యానిమల్‌' తర్వాత నా లైఫ్​లోని చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఖాళీగా లేను. అప్పుడు ఉన్నంత స్వేచ్ఛగా కూడా లేను. ఫ్రెండ్స్‌ను మిస్‌ అవుతున్నాననే బాధ ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.

'ఆ సినిమా తర్వాత సెట్​లో తన ట్రీట్మెంటే మారిపోయింది - అందరూ అలా చేస్తున్నారు' - Tripti Dimri Dhadak 2

అతడితో ప్రేమలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి - ఫొటో షేర్ చేసిన ప్రియుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.