Who Is Best Tollywood Director : టాలీవుడు దర్శకులు పాన్ ఇండియా మూవీలు తీస్తూ అదరగొడుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు తెలుగు సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెడుతున్నారు. అలా తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ తమ తమ జానర్లలో సినిమాలు తీస్తూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, తాజాగా వచ్చిన కల్కి చిత్రాలు టాలీవుడ్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇక పుష్ప లాంటి చిత్రాలైతే విదేశాల్లోనూ తెలుగోడి సత్తా చాటాయి. టాలీవుడ్ దర్శకులు ప్రపంచ సినిమాపై తెలుగు ముద్ర కనిపించేలా సినిమాలు చేస్తున్నారు.
ఓవైపు అనుభవమున్న ఉద్ధండ దర్శకులు తమ సత్తా చాటుతుంటే, మేమేం తక్కువ కాదంటూ యువ దర్శకులు కూడా సినీ కాన్వాస్‌పై తమదైన రీతిలో అద్భుత చిత్రాలు అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్లు నేటి టెక్నాలజీతో ప్రేక్షకుల మదిలోకి మరింతగా చొరబడేలా సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు తమ సత్తా ఏంటో చూపారు. టాలీవుడ్లో ది బెస్ట్ డైరెక్టర్ అనే జాబితా ఒకటి రూపొందిస్తే అందులో మొదటి ఐదు పేర్లలో దర్శకధీరు, జక్కన్న.. ఎస్ఎస్ రాజమౌళి పేరు తప్పక ఉండాల్సిందే.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తం చేశారు. ఆస్కార్ అంటే అందని ద్రాక్షగానే భావించే టాలీవుడ్‌కు ఏకంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ తీసుకొచ్చారు. అలా గ్లోబల్ వైడ్‌గా తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పారు. ఇక పుష్ప సినిమాతో తగ్గేదేలే అంటూ రోరింగ్ బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్ కూడా ఈ లిస్టులో తప్పక ఉండాల్సిందే. ఆయన సినిమాల్లో మ్యాజిక్ కంటే ఎక్కువ లాజిక్ ఉంటుంది.
ఇక వీళ్లే కాకుండా పూరీ జగన్నాథ్.. చంటిగాడు లోకల్ అంటూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించాడు పూరీ. తన సినిమాలు, తన సినిమాల్లో హీరోలు, వాళ్ల డైలాగ్లు.. ఇలా ప్రతి ఒక్కటీ పూరీ చిత్రాల్లో స్పెషలే. ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్‌లా ప్రతి మాటలో పంచ్ పేలుతుంది. పూరీ సినిమా టేకింగ్ స్టైల్‌కు మామూలు ఫ్యాన్స్ లేరు. ఇక కామెడీ సినిమాలు తీయడంలో నేటి ట్రెండ్‌కు తగ్గ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ రావిపూడి దిట్ట. అందుకే ఆయనకు ఈ జాబితాలో చోటుందండోయ్.
ఇక నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో సైలెంట్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత మహానటితో ఆయన పేరు మార్మోగేలా తెలుగు చిత్ర పరిశ్రమంతా ఆయన వైపు చూసేలా చేశాడు. ఆ తర్వాత ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ చిత్రం తీసి తన లాంటి డైరెక్టరే లేడనిపించాడు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ టాలీవుడ్లో ఒక్కసారిగా టాప్‌లోకి వెళ్లిపోయింది. అలా ఈ ఐదుగురు దర్శకులు వారి వారి జానర్లలో సినిమాలు తీస్తూ టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. మరి వీరిలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు? మీకు నచ్చిన డైరెక్టర్‌కు మీరు ఓటేయండి.