Visweswara Rao: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హాస్యనటుడిగా ఆయన 150కు పైగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు సినీ పరిశ్రమలు సంతాపం తెలియజేశాయి. బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని సిరుశేరులో నివాసంలోనే ఉంచి, బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన ఈయన బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చెన్నైకి వలస వెళ్లిపోయారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 350కి పైగా నటించిన ఈయన, టీవీ సీరియల్స్ లో కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా కూడా కనిపించారు. కేవలం బాలనటుడిగానే దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారంటే అతిశయోక్తి కాదు.
తొలి సినిమా 'పొట్టి ప్లీడరు'తో బాలనటుడిగా వెండితెరపై కనిపించిన విశ్వేశ్వరరావు 'భక్తి పోతన', 'బాలమిత్రుల కథ', 'ఓ సీత కథ', 'మా నాన్న నిర్దోషి', 'పట్టిందల్లా బంగారం', 'అందాల రాముడు', 'సిసింద్రీ', 'చిట్టిబాబు', 'ఇంటి గౌరవం' సినిమాల్లో నటించారు. తెరపై కాసేపే కనిపించినా ఆయన కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా హాస్యం పండించేవారు. ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల దగ్గరి నుంచి తర్వాతి తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కల్యాణ్ పక్కన వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. 'ముఠా మేస్త్రీ', 'బిగ్ బాస్', 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం', 'ఆయనకు ఇద్దరు', 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' లాంటి విజయవంతమైన చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. రెండు జనరేషన్‌లలోని హీరోలతో కలిసి నటించానని, అంతేకాకుండా (ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత) ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించడం గర్వంగా ఉందని అనేక సందర్భాల్లో తెలియజేశారు విశ్వేశ్వరరావు.
ఇటీవల కొద్ది కాలంగా విస్సు టాకీస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు విశ్వేశ్వరరావు. అందులో తన సినీ అనుభవాలు, కష్టాలు పంచుకుంటూ నేటితరానికి కూడా చేరువయ్యారు. ఈ వేదికగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన జ్ణాపకాలు కూడా పంచుకునేవారు. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ లాంటి సీనియర్లు కోల్పోవడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాలీవుడ్లో మరో విషాదం - ప్రముఖ రైటర్ కన్నుమూత - Sri Ramakrishna Died
షాకింగ్ - ప్రముఖ కోలీవుడ్ విలన్ కన్నుమూత - Daniel Balaji Died