ETV Bharat / entertainment

'ఆ సినిమాతో వచ్చిందేమి లేదు- 10ఏళ్ల తర్వాత రూట్ మార్చేస్తా'- విశ్వక్ సేన్ - Vishwak Sen Birthday - VISHWAK SEN BIRTHDAY

Vishwak Sen Birthday: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఒంగాలి, లొంగాలి, తగ్గాలి అని అంటే అలా అనుకుంటే అది పొరపాటే. ఈ పాత సూక్తులు ఏవీ తనకు పనికిరావని తన ఒరిజినాలిటీని ఎవరి కోసం మార్చుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త తడబడినా దర్శకత్వం తెలిసిన నటుడిగా ఎదిగి స్టార్ అయిపోయి కూర్చున్నాడు. అతనే ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్.

Vishwak Sen Birthday
Vishwak Sen Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 6:53 AM IST

Vishwak Sen Birthday: యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్​లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. రీసెంట్​గా గామి సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్​లో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందాడు. అయితే ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ, తనకంటూ ఓ ఫ్యాన్​బేస్ ఏర్పర్చుకున్న విశ్వక్ తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడింది ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

విశ్వక్​ కెరీర్​లో ఏదీ ఈజీగా రాలేదట. ఒకవేళ వస్తే అది తనకే షాకింగ్ గా అనిపిస్తుందని చెప్తున్నాడు. కెరీర్ కొత్తలో నటించిన 'వెళ్లిపోమాకే' సినిమా ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు తీసుకురాలేదని ఆ తర్వాత ఆఫర్లు రాలేదని ఏడ్చానని కూడా చెప్పాడు. అలాంటి సమయంలో సినిమా ఆడిషన్లకు వెళ్లడం, సెలక్ట్ కాకపోవడం వంటివి చూసి తన తండ్రి 'మనమే సినిమా తీద్దాం ఎందుకురా అంత బాధపడతావు' అని ధైర్యం చెప్పారట. అలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే 'ఫలక్‌నుమా దాస్'.

దీని గురించి చర్చించుకుంటున్న సమయంలోనే తరుణ్ భాస్కర్ కొత్త కథని రెడీ చేసుకున్నాడని వేరే ఎవరో చెప్పారట. ఆడిషన్ ఇవ్వమని అంటే ముందుగా ఫొటో పంపిచూశాడట. తనకు ఇలాంటి వ్యక్తే కావాలని చూస్తున్నానని తరుణ్ వెంటనే విశ్వక్​ను సెలక్ట్ చేసేశాడట. కాకపోతే కొద్ది రోజుల తర్వాత విశ్వక్‌సేన్ గురించి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చి రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారట. ఆ డౌట్ క్లియర్ చేసుకుని సినిమాలో అవకాశం దక్కించుకున్నానని, ఆ విషయంలో తరుణ్ భాస్కర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పాడు. జీవితాంతం తరుణ్ భాస్కర్​కు రుణపడి ఉంటానని వెల్లడించాడు.

ఆ తర్వాత 'ఓరి దేవుడా', 'అశోక వనంలో అర్జున కల్యాణం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'దాస్ కా దమ్కీ' సినిమాలతో స్టార్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్​గా 'గామి' లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తనకు కాస్త మార్షల్ ఆర్ట్ కూడా టచ్ ఉందట. త్వరలో జాకీష్రాఫ్ అంత అవుతానని, పదేళ్లు యాక్టింగ్ చేసి తర్వాత డైరక్షన్ చేస్తానని మనసులో మాట బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్​లతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. త్వరలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

జోరు చూపిస్తున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?

'ఆ సమయంలో చాందినీని చూసి భయపడ్డా - ఇకపై అటువంటి సాహసాలు చేయను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.