Vikrant Massey 12th Fail : చిన్న చిత్రంగా విడుదలై మాసివ్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో బాలీవుడ్ మూవీ 'ట్వల్త్ ఫెయిల్' కూడా ఒకటి. ఐపీఎస్ మనోజ్‌కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఇన్స్పిరేషనల్ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ దీనిపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హిందీ నటుడు విక్రాంత్ మస్సే.
ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు. బుల్లితెరపై నటిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో 110 గంటలు విరామం లేకుండా వర్క్ చేసినట్లు పేర్కొన్నారు.
" 17 ఏళ్ల వయసులో నేను నా బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించాను. దశాబ్దానికి పైగా వివిధ సీరియల్స్‌లో కనిపించాను. ఉదయం పది గంటలకు సెట్‌కి వస్తే సాయంత్రానికి అందరూ వెళ్లిపోతారు. కానీ ఒకప్పుడు మాత్రం ఆర్టిస్టులు 18 గంటలు షూటింగ్ చేసేవారు. నా జీవితంలో కూడా నేను దాదాపు 110 గంటలు విరామం లేకుండా పని చేసిన రోజులు ఉన్నాయి. ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసి నన్ను ఒక పిల్లర్‌లా ఉపయోగించి మరీ షూటింగ్ చేశారు. చివరికి సెట్ ప్రొపర్టీ తీసుకెళ్తున్నా కూడా నాకు మాత్రం వర్క్ ఉండేది" అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. మరోవైపు హిందీలో తనకు మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) నాకు మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్స్‌లో ఒకటి. ఇందులో నేను ఓ అతిథి పాత్రలో కనిపించాల్సింది. అయితే కంటెంట్ బాగుందని శ్యామ్ భాయ్ అనే పాత్రను పోషించాను. ప్రేక్షకులు ఆ పాత్రను ఎంతగానో ఆదరించారు. సీరియల్ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు శ్యామ్ పాత్రకు ఉన్న ఆదరణే తిరిగి ప్రసారం అయినప్పుడు కూడా ఇంకా కొనసాగింది. నేను ఆ సీరియల్లో దాదాపు రెండేళ్ల పాటు వర్క్ చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకి టెలివిజన్ ఇండస్ట్రీకి దూరమయ్యాను" అని విక్రాంత్ వెల్లడించారు.
'12th ఫెయిల్' సెన్సేషన్ - ఆ లిస్ట్‌లో ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డు
'యశస్వి క్రికెట్ వెర్షన్ ఆఫ్ మనోజ్ శర్మ'- జైశ్వాల్ జర్నీ '12th ఫెయిల్' సినిమాలాంటిదే!