ETV Bharat / entertainment

'దళపతి 69' ప్రాజెక్ట్​ డీటెయిల్స్​ ఇవే! - హీరోయిన్ ఎవరంటే? - Vijay Thalapathy 69 - VIJAY THALAPATHY 69

Thalapathy 69 Movie Update : కోలీవుడ్​ స్టార్​ హీరో దళపతి విజయ్‌ నటించబోయే చివరి సినిమాకు సంబంధించిన అప్డేట్స్​ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Thalapathy 69 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 11:16 AM IST

Thalapathy 69 Movie Update : కోలీవుడ్​ స్టార్​ హీరో దళపతి విజయ్‌ నటించిన 'ది గోట్‌' ప్రస్తుతం థియేటర్లో రన్‌ అవుతోంది. ఇంతలోనే విజయ్​ చివరి సినిమాకు సంబంధించిన అప్డేట్​ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెట్టింట్లో #Thalapathy69 హ్యాష్ ట్యాగ్​ ఫుల్​ ట్రెండ్ అవుతోంది. విజయ్​ ఫ్యాన్స్​ అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే సినిమా గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు కానీ, చిత్రానికి సంబంధించిన పలు విషయాలు, తారాగణం గురించి డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

విజయ్‌ 69వ చిత్రంగా రానున్న ఈ చిత్రాన్ని కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రానుంది. డైరెక్టర్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా రిలీజైంది. ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత లేదా హీరోయిన్ పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Thalapathy 69 Heroine : ఒకవేళ సమంత ఈ చిత్రంలో నటిస్తే, విజయ్​తో ఆమెకు ఇది నాలుగో చిత్రం అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో థేరీ, కత్తి, మెర్సల్ సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. దీంతో వీరిని హిట్​ పెయిర్ అని అంటుంటారు. వీరి ఆన్​స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకవేళ పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తే, విజయ్​తో ఆమెకు ఇది రెండోది అవుతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన బీస్ట్ పర్వాలేదనిపించింది.

ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుందని టాక్‌ వినిపిస్తుంది. అలాగే ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అవుతుందని అంటున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తారట. మాస్టర్, తెలుగు 'దసరా' సినిమాలకు పని చేసిన సత్యన్ సూరన్ విజయ్ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించబోతున్నారట. బాలీవుడ్ నటుడు బాబీ దేఓల్ విలన్​గా నటిస్తారట. ఏదేమైనా వీటన్నిటిపై ఓ క్లారిటీ రావాలంటే మూవీటీమ్​ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, దళపతి విజయ్‌ ఆ మధ్య 'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నుంచి చివరి చిత్రంగా దళపతి 69 రానుంది.

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న - ఏమని అడిగారంటే? - Kaun Banega Crorepati Pawan Kalyan

పవన్‌, మహేశ్‌ ఎవరి సినిమాలో నటిస్తారు? - ఖుష్బూ ఏం చెప్పారంటే? - Actress Kushboo Sundar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.