ETV Bharat / entertainment

నయనతార భర్తతో గొడవ - స్పందించిన విజయ్‌ సేతుపతి - Vijay Sethupathi Maharaja - VIJAY SETHUPATHI MAHARAJA

Vijay Sethupathi Nayantara Husband vignesh shivan : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో జరిగిన వివాదంపై మాట్లాడారు. ఏమన్నారంటే?

Source ANI and ETV Bharat
Nayanthara vijay sethupathi (Source ANI and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 2:11 PM IST

Vijay Sethupathi Nayantara Husband vignesh shivan : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన మహారాజ చిత్రంతో మరో హిట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో జరిగిన వివాదంపై మాట్లాడారు. ఆయన్ను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. ఏ నటుడికైనా దర్శకులతో విభేదాలు రావడం సర్వ సాధారణమని అన్నారు.

"నేను రౌడీ మొదటి రోజు చిత్రీకరణ తర్వాత దర్శకుడు విఘ్నేశ్‌కు ఫోన్‌ చేసి మరీ గొడవ పడ్డాను. నువ్వు నాకు యాక్టింగ్​ నేర్పుతున్నావా నేను చేసేది నీకు అర్థం అవ్వడం లేదు అంటూ గట్టిగా అరిచి చెప్పాను. అనంతరం నాలుగు రోజుల తర్వాత నయన్​ మా ఇద్దరితో మాట్లాడి సర్దిచెప్పింది. విక్కీ ఆ స్క్రిప్ట్‌ నాతో చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అందుకే తక్షణణే అంగీకరించాను. షూటింగ్‌ మొదలయ్యాక ఆయన్ను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టింది. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ చిత్రంలో నా పాత్రేంటో తెలుసుకోవడానికి నాకు నాలుగు రోజులు టైమ్​ పట్టింది. అందులో కొన్ని సీన్స్​ చేసేటప్పుడు అభద్రతాభావానికి కూడా లోనయ్యాను. విఘ్నేశ్‌ టాలెంట్ ఉన్న డైరెక్టర్​. ఎవరూ టచ్‌ చేయని కథలను గొప్పగా తీయగలతాడు. అతడిపై నమ్మకం ఉంచితే చాలు అద్భుతాలు చేస్తాడు" అని ప్రశంసించారు.

Vijay Sethupathi Maharaja Movie : కాగా, నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో మహారాజ తెరకెక్కింది. సినిమా గురించి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేశ్‌ కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌ పెట్టారు. కోలీవుడ్​ ఇండస్ట్రీలో మహారాజ ఓ అద్భుతమని అన్నారు. విజయ్‌ సేతుపతి నటించిన తన 50వ సినిమా ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిపోతుందని చెప్పారు. స్క్రిన్‌ప్లే చాలా బాగుందని కితాబిచ్చారు. ఇకపోతే విజయ్ సేతుపతి ప్రస్తుతం గాంధీ టాక్స్​, విడుదలై(రెండో భాగంలో) సినిమాల్లో నటిస్తున్నారు. ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి.

'స్టోరీ వినగానే 50వ సినిమాగా ప్రకటించాను - ఇకపై అదే నా ఫ్యూచర్ ప్లాన్' - Vijay Sethupati Maharaja Movie

అది దృష్టిలో పెట్టుకొనే 'కల్కి' చేశాను : నాగ్​ అశ్విన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.