Vicky Kaushal Tripti Dimri Bad Newz Movie Review : యానిమల్ చిత్రంతో యూత్‌ను ఆకట్టుకున్న బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఆ చిత్రంలో హీరో రణ్‌బీర్ కపూర్‌తో హాట్ రొమాన్స్ చేసి ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆమె నుంచి వచ్చిన మరో లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూజ్. ఇందులో కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ హీరోగా నటించగా అమీ ఆర్క్, నేహా ధూపియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే ? సినిమాలో సలోనీ బగ్గాగా నటించింది త్రిప్తి దిమ్రీ. ఆమె వంటల పోటీల్లో ఆస్కార్‌లా భావించే మెరాకీ స్టార్ పురస్కారాన్ని అందుకోవాలని ఎన్నో కలలు కంటుంది. అలానే తనకు కాబోయే జీవిత భాగస్వామి విషయంలోనూ ఎన్నో కలలు కంటుంది. ఫైనల్‌గా ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో తన కలల్ని పక్కనపెట్టి చివరికి దిల్లీ కరోల్‌బాగ్‌కు చెందిన ఓ షాప్ ఓనర్ అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ను పెళ్లి చేసుకుంటుంది.
అయితే తల్లి చాటు తనయుడైన అఖిల్‌కీ - సలోనీకీ మధ్య హానీమూన్‌లోనే మనస్పర్థలు తలెత్తుతాయి. దీంతో విడాకుల వరకూ వెళ్తారు. ఈ క్రమంలోనే సలోనీ మరో హోటల్ నిర్వాహకుడైన గుర్‌బీర్ పన్ను (అమీ విర్క్)కు దగ్గరవుతుంది. దీంతో గర్భం దాల్చుతుంది. అయితే సలోనీ కడుపులో అఖిల్ చద్దా, గుర్‌బీర్ పన్నుకు చెందిన కవలలు ఉంటారు. దీన్ని హెటెరోపాటర్నల్ సూపర్ ఫెకండేషన్ కేసుగా డాక్టర్లు నిర్ధారిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరు తండ్రులు ఈ సంఘటనను ఎలా స్వీకరించారు?తమ బిడ్డల కోసం ఏం చేశారు? అనేదే సినిమా కథ.
ఎలా ఉందంటే? - వాస్తవానికి ఈ కథ ఎంతో సంక్లిష్టతతో కూడినది. కానీ ఈ అంశాన్ని సున్నిత కోణంలో చూపిస్తూనే హాస్యమే ప్రధానంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఈ కథ, కథనాలు పెద్దగా ప్రభావం చూపింలేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, సంభాషణలతో నవ్వించాయి తప్ప సినిమా రక్తికట్టలేదు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కథలో లోతు కనిపించదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ను సాగదీశారు.
ఎవరెలా చేశారంటే ? - విక్కీ కౌశల్ నటన ఈ సినిమాకు హైలైట్. సినిమాలో కామెడీ పండిందంటే అందుకు కారణం విక్కీనే. త్రిప్తి నటన ఈ సినిమాకు సరిపోలేదు. భావోద్వేగాల్ని అంతగా పండించలేకపోయింది. నవ్వుతూ కనిపించడం, రొమాన్స్ సన్నివేశాల వరకూ ఓకే అనిపించింది. అమీ విర్క్ తన పాత్రకు తగ్గట్టే నటించాడు. దర్శకుడు ఆనంద్ తివారీ కొన్ని సన్నివేశాలపైన మాత్రమే ప్రభావం చూపించారు.
ఫైనల్‌గా విక్కీ కౌశల్ నటన, అక్కడక్కడా హాస్యం సినిమాకు బలాలు. ఊహకు తగ్గట్టుగా సాగే కథ, కథనాలు, కొరవడిన భావోద్వేగాలు బలహీనతలుగా నిలిచాయి. చివరిగా: బ్యాడ్ న్యూజ్ జస్ట్ కామెడీ న్యూజ్.
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్ రాజ్! - Rajtarun purushothamudu
రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం - 'నాటునాటు'కు రెడీ అవ్వండి ఫ్యాన్స్