Varun Tej Matka : మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా పాన్ఇండియా లెవెల్లో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే సోమవారం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
అయితే మేకర్స్ హిందీ టైటిల్లో స్వల్ప మార్పులు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో 'మట్కా వాసు' టైటిల్‌తో రిలీజ్ చేయాలని మూవీటీమ్ భావిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. దీని గురించి సోమవారం మంబయి ప్రెస్మీట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ముంబయి ప్రెస్‌మీట్ నేపథ్యంలో మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ టైటిల్ 'మట్కా వాసు' అని రాసి ఉంది. దీంతో టైటిల్లో మార్పు కన్ఫార్మ్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
#MATKA is #MATKAVASU in HINDI ❤️🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 3, 2024
The MATKA KING will arrive in Mumbai for the Press Meet Tomorrow, 11AM at Novotel, Juhu 💥
IN THEATERS FROM NOVEMBER 14th 🔥#MATKAonNOV14th
Mega Prince @IamVarunTej @KKfilmmaker #NoraFatehi @Meenakshiioffl @gvprakash @kishorkumardop… pic.twitter.com/3baySmOGnf
నాని ట్రెండ్ ఫాలో అయ్యారా?
నేచురల్ స్టార్ నాని - ప్రియాంక అరుళ్ మోహన్ లీడ్ రోల్స్‌లో పాన్ఇండియా రేంజ్లో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' డీసెంట్ విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు కూడా హిందీ టైటిల్లో కాస్త మార్పులు చేశారు. 'సరిపోదా శనివారం' టైటిల్‌ను కాస్త హిందీలో 'సూర్య శనివారం' (Surya's Saturday)గా మార్చారు. హిందీతోపాటు ఇతర భాషల్లోనూ ఈ టైటిల్‌తోనే సినిమా రిలీజైంది.
అయితే 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కించినట్లు డైరెక్టర్ కరుణ కుమార్ చెప్పారు. ఆ సమయంలో విశాఖపట్నం ఎలా ఉండేది? అక్కడ మనుషులు ఎలా ఉండేవారు? హీరో ప్రస్థానం ఎలా మొదలైంది? అనే విషయాలను సినిమాలో చూపించనున్నారు. కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. వైరా, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విజేంధర్ రెడ్డి, రజని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
'బాబాయ్ టైటిల్ వాడినందుకు వణికిపోయా!': వరుణ్ తేజ్
'OG స్టోరీ బాబాయ్ కంటే ముందు నేనే విన్నా - ఇది మీ ఊహకు అందదు' - Varun Tej on OG Movie