Varun Dhawan Alluarjun Arrest : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అంశంపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కామెంట్స్ చేశారు. తన కొత్త చిత్రం 'బేబీ జాన్' ప్రమోషన్స్‌లో భాగంగా జైపుర్‌లో జరిగిన ఈవెంట్‌లో వరుణ్ ధావన్ మాట్లాడారు.
"భద్రతా పరమైన, ఇతర అంశాలను నటీ నటులు ఒక్కరే చూసుకోలేరు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే ప్రజలకు చెప్పగలం. ఏదైతే ఈరోజు జరిగిందో అది బాధాకరమైన విషయం. ఈ ఘటనపై సానుభూతి తెలుపుతున్నాను. ఒక వ్యక్తినే నిందించడం కరెక్ట్ కాదు." అని అన్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
సంధ్య థియేటర్ వద్ద అసలేం ఏం జరిగిందంటే?
Allu Arjun Sandhya Theatre Tragedy : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2: ది రూల్. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 4న (బుధవారం) వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అయితే ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లోనూ షో ప్రదర్శించారు.
అక్కడికి అల్లు అర్జున్ రావడం, పుష్ప 2 ప్రదర్శన కావడం వల్ల థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే వారిని బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీకెండ్ స్పెషల్ - ఒక్కరోజే 22 సినిమా/సిరీస్‌లు - ఆ 4 చిత్రాలు వెరీ స్పెషల్!
'అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?' - వైరల్‌గా హీరో సిద్ధార్థ్ సమాధానం!