ETV Bharat / entertainment

మెగా హీరో కొత్త సినిమా -టైటిల్​గా సూపర్ స్టార్ పాట! - Vaishnav Tej New Movie Title - VAISHNAV TEJ NEW MOVIE TITLE

Vaishnav Tej New Movie Title : టాలీవుడ్ స్టార్ హీరో వైష్ణవ్ తేజ్​ అప్​కమింగ్ మూవీకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్​ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఆ వివరాలు మీ కోసం

Vaishnav Tej
Vaishnav Tej (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 11:41 AM IST

Vaishnav Tej New Movie Title : మెగా యంగ్ హీరో వైష్ణవ్​ తేజ్ ప్రస్తుతం తన అప్​కమింగ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే 'ఆదికేశవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ, ఆ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ సారి వైష్ణవ్ మరింత కొత్త కాన్సెప్ట్​తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్​ను ఫిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఓ ఫేమస్ సాంగ్​లోని లైన్​ అని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఎంతటి సూపర్ సక్సెస్​ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమనే కాదు అందులోని పాటలు కూడా మ్యూజిక్ లవర్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. ఇక 'వచ్చాడయ్యో సామీ' అంటూ వచ్చే హీరో ఎలివేషన్ సాంగ్ ఇప్పటికీ మహేశ్ అభిమానుల్లో ఎంతో జోష్​ నింపుతుంది. అయితే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాకు ఈ సాంగ్​లోని 'వచ్చాడయ్యో సామి' అనే లైన్​ను టైటిల్​గా పెట్టనున్నారట.

ప్రస్తుతం ఈ టైటిల్ మూవీ లవర్స్​లో తెగ ఆసక్తి నింపుతోంది. అయితే ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియనుందున అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. టైటిల్ చూస్తుంటే ఇది మరో ఎనర్జిటిక్ యాక్షన్ మూవీగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతుండగా, మరికొందరేమో ఇది ఫ్యామిలీ ఎంటర్​టైనర్ అయ్యుండచ్చని అంటున్నారు.

ఇక వైష్ణవ్ కెరీర్ విషయానికి వస్తే, 'ఉప్పెన'తో ఇండస్ట్రీకి పరిచమైన ఈ యంగ్ హీరో తొలి సినిమాతోనే ప్రేక్షకులను అలరించారు. అంతకంటే ముందే ఆయన 'జానీ',' శంకర్ దాదా MBBS',' అందరివాడు' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేశారు. ఇక 'ఉప్పెన' హిట్​తో వరుసగా 'కొండపొలం','రంగ రంగ వైభవంగా',' ఆదికేశవ'లో నటించినప్పటికీ అవేవీ ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి.

'ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వలేను - అందుకే ఆ పని చేశా'

వైష్ణవ్​తేజ్​పై చిరంజీవి సీరియస్​, ఏమైందంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.